ETV Bharat / lifestyle

నిర్లక్ష్యంతో కీళ్ల నొప్పులు.. - కీళ్ల నొప్పులకు కారణాలు

మహిళలు ఇంటిపనుల్లో, ఆఫీసు పనుల్లో నిమగ్నమై అసలు తమను తాము పట్టించుకోవడం మానేస్తారు. దానివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో ఒకసారి గమనించుకోండి..

girls-take-healthy-food-to-avoid-arthritis
నిర్లక్ష్యంతో కీళ్ల నొప్పులు..
author img

By

Published : Apr 29, 2021, 10:49 AM IST

నూటికి తొంబై శాతం మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహార విషయంలో మరింత అశ్రద్ధ చూపుతున్నారని సర్వేల్లో తేలింది. దీని వల్ల చిన్న వయసులోనే కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు.
* కొంతమంది లావైపోతున్నామనే బెంగతో ఆహారం తినడం మానేస్తున్నారు. దానివల్ల సన్నబడటం మాట అటుంచితే లేని జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. సాధారణంగా 40 నుంచి 45 లోపు ఉన్నవాళ్లకి కీళ్ల నొప్పులు వస్తాయి. కానీ నిర్లక్ష్యంతో 25 ఏళ్లకే వచ్చేస్తున్నాయ్‌.
* శరీరానికి కావల్సిన కాల్షియం, విటమిన్‌ డి లు తక్కువైతే ఎముకలు బలహీన పడతాయి. దీంతో ఆస్టియోపొరోసిస్‌ అనే జబ్బు రావడం ఖాయం. ఇది వస్తే జీవితాంతం ఉంటుంది. ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి మహిళలు సరైన టైంలో సరిగ్గా ఆహారాన్ని తీసుకుంటే మంచిదని లేదా అనారోగ్యం బారిన పడే అవకాశాలు మెండు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్‌ చికిత్స.. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.