ETV Bharat / lifestyle

బ్యూటీ ట్రెండ్ : చర్మ సౌందర్యానికి చార్‌కోల్‌

author img

By

Published : Sep 29, 2020, 4:30 PM IST

అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మరి ఎప్పుడైనా యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ని ఇందుకోసం ప్రయత్నించారా! ఇప్పుడిదే బ్యూటీ ట్రెండ్‌. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఎలా వాడాలి... వంటివి తెలుసుకుందామా!

char coal pack is good for healthy  skin
చర్మ సౌందర్యానికి చార్‌కోల్‌

ఫేస్‌ మాస్క్‌లా:

చర్మంపై ఒక్కోసారి జిడ్డుపేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు చార్‌కోల్‌ పౌడర్‌ను తీసుకుని నీళ్లలో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలు అయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా పదిరోజులకు ఓసారి చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై పడిన గుంతలు తగ్గుతాయి.

మచ్చలు తొలగేలా:

ఒక్కోసారి తెగిన, కాలిన గాయాలు...మానిపోయినా మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి. అలాంటప్పుడు రెండు చెంచాల చార్‌కోల్‌ పౌడర్‌, చెంచా తేనె, కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోండి. దీన్ని మచ్చపై రాయండి.ఇలా కొన్ని రోజులు చేస్తే మీ సమస్య దూరమవుతుంది.

ఒత్తైన కురులకు:

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు.. తలసాన్నానికి ముందు షాంపూలో కొద్దిగా చార్‌కోల్‌ మిశ్రమాన్ని కలపండి.. లేదా మార్కెట్‌లో దొరికే చార్‌కోల్‌ షాంపూని మీ జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి. చార్‌కోల్‌లో ఉండే కార్బన్‌ మీ జుట్టుకి దృఢత్వానిచ్చి రాలకుండా చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.