ETV Bharat / lifestyle

నీళ్లెలా తాగాలో చెబుతోన్న బాలీవుడ్ ఫిట్టెస్ట్ మామ్

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజుకో కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, విభిన్న ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏ సమయానికి తింటున్నాం? వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రం మర్చిపోతుంటాం. ఇదే విషయం గురించి నొక్కి వక్కాణిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా.

Bollywood beauty malaika arora says how to drink water to be healthy
నీళ్లెలా తాగాలో చెబుతోన్న బాలీవుడ్ ఫిట్టెస్ట్ మామ్
author img

By

Published : Jun 9, 2020, 1:54 PM IST

ఫిట్‌నెస్‌లో భాగంగా మనం పాటించే నియమాల్లో నీళ్లు తాగడం కూడా ఒకటని, అయితే నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది ఫిట్​నెస్​ బ్యూటీ మలైకా అరోరా. లాక్‌డౌన్‌లో భాగంగా ఇప్పటికే తన ఫిట్‌నెస్‌, హెల్దీ, బ్యూటీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంది మలైకా. ఇక తాజాగా నీళ్లు ఎలా తాగాలో వివరిస్తూ తన అభిమానులకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

మలైకా అరోరా.. బాలీవుడ్‌లో ‘ఛయ్య ఛయ్య’ దగ్గర్నుంచి టాలీవుడ్‌లో ‘కెవ్వు కేక’ దాకా.. పలు ప్రత్యేక గీతాల్లో నర్తించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాలకు దూరమైనా.. సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉందీ ముద్దుగుమ్మ. 18 ఏళ్ల కొడుకున్నా.. ప్రస్తుతం 46 ఏళ్ల వయసులోనూ వన్నె తరగని అందానికి, ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుందీ క్యూట్‌ మామ్‌. దీనికంతటికీ కారణం తాను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలేనంటూ తాను వర్కవుట్‌ చేసే వీడియోలు-ఫొటోలతో పాటు పాటించే డైట్‌ సీక్రెట్స్‌ గురించి కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటుందీ ఫిట్టెస్ట్‌ మామ్‌. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాలో మరో వీడియోను పోస్ట్‌ చేసి నీళ్లు ఎలా తాగాలో మనందరికీ నేర్పుతోందీ దబాంగ్‌ బ్యూటీ.

దానికీ ఓ పద్ధతుంది.. !

నీళ్లు ఎలా తాగాలి.. తద్వారా మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి.. వంటి విషయాల గురించి చెబుతూ తీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది మలైకా. ఇందులో భాగంగా.. ‘ఈ రోజు నేను మీతో నా హెల్త్‌ సీక్రెట్‌ను పంచుకోవాలనుకుంటున్నా. మన ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మంచిదో, శరీరానికి ఎంత నిద్ర అవసరమో, ఆరోగ్యంగా-ఫిట్‌గా ఉండడానికి ఎంత సేపు వ్యాయామం చేయాలో, ఎంత సేపు ఎండలో నిలబడాలో, రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో.. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. అయితే నీళ్ల దగ్గరికి వచ్చే సరికి బరువును బట్టి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలిసినా.. వాటిని ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ విషయం చాలామందికి సిల్లీగా అనిపించచ్చు. నీళ్లెలా తాగాలో మాకు తెలియదా? అనుకునే వారూ లేకపోలేదు. కానీ నీళ్లు తాగడానికీ ఓ పద్ధతుంది. అదేంటో నేను మీకు చెబుతా. మీరు నీళ్లు తాగాలనుకున్నప్పుడు మొదట చేయాల్సిన పని కూర్చోవడం.. ఇలా కూర్చొని కొద్దికొద్దిగా నీళ్లు తాగుతుండాలి (సిప్‌ చేస్తుండాలి). అంతేకానీ నిలబడి గటగటా నీళ్లు తాగేయకూడదు. కూర్చొని కొద్దికొద్దిగా నీళ్లు తాగడం, ఇలా రోజంతా నిర్ణీత వ్యవధుల్లో ఇదే పద్ధతిని పాటించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా! ఈ ప్రక్రియ ద్వారా శరీరం హైడ్రేట్‌ అవడంతో పాటు శరీరానికి పోషణ కూడా అందుతుంది. కాబట్టి మీరూ ఈ క్షణమే ఈ పద్ధతిని మొదలుపెట్టేయండి..’ అంటూ చెప్పుకొచ్చిందీ సుందరి.

అవే మర్చిపోతుంటాం!

ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న మలైకా.. ‘మనమంతా ఫిట్‌గా ఉండడానికి రోజూ ఎన్నెన్నో మార్గాల్ని అన్వేషిస్తుంటాం. కొత్త వ్యాయమాలు సాధన చేయడం, మార్కెట్లోకి వచ్చిన కొత్త రుచుల్ని టేస్ట్‌ చేయడం, ఏం తినాలి?, ఎంత తినాలి?.. వంటి విషయాలపై పూర్తి దృష్టి పెడతాం. కానీ కొన్ని ప్రాథమిక విషయాలనే మర్చిపోతుంటాం. నీళ్లు తాగడం కూడా ఇందులో ఒకటి. కాబట్టి మన శరీరానికి శక్తిని, ఫిట్‌నెస్‌ను, ఆరోగ్యాన్ని అందించే నీళ్ల విషయంలో నిర్లక్ష్యం తగదు. పద్ధతి ప్రకారం నీళ్లు తాగండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఈ క్రమంలో నేను చెప్పిన ఈ సింపుల్‌ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ గబ్బర్‌ బ్యూటీ.

ఎన్నెన్నో ప్రయోజనాలు!

  • కూర్చొని రిలాక్సవుతూ కొద్దికొద్దిగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలానే ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
  • గ్లాసుతో తాగినా, బాటిల్‌తో తాగినా.. ఒక చోట కూర్చొని కొద్దికొద్దిగా నీళ్లు తాగడం వల్ల పోషకాలు మెదడుకు అంది.. దాని పనితీరు మెరుగవుతుంది.
  • కూర్చుని కొద్దికొద్దిగా నీటిని సిప్‌ చేయడం వల్ల కడుపులోకి గ్యాస్‌ చేరదు.. తద్వారా పొట్ట ఉబ్బిన భావన కలగదు.
  • నిలబడి నీళ్లు తాగితే శరీరంలోని ఫ్లూయిడ్స్‌ స్థాయులు అదుపు తప్పి అవి కీళ్లలోకి చేరే ప్రమాదం ఉంది.. ఇది ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. కాబట్టి కూర్చొని కొద్దికొద్దిగా నీళ్లు తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
  • కూర్చుని నీళ్లు తాగడం వల్ల కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుందట. ఈ క్రమంలో మూత్రపిండాలకు మూత్రాన్ని వడకట్టే సామర్థ్యం పెరుగుతుంది.
  • నిల్చొని గటగటా నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ, అన్నవాహికపై కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి కూర్చుని నీళ్లు తాగడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ రిలాక్స్‌ అయి.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
  • కూర్చుని కొద్దికొద్దిగా నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన నీరు మాత్రమే అంది.. శరీరానికి ఆమ్లాలను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
  • ఏ కాలమైనా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన నీళ్లనే తాగాలి. మరిగించి కాస్త గోరువెచ్చగా అయ్యాక తాగితే మరీ మంచిది.

కూర్చుని కొద్దికొద్దిగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారుగా..! మరి, ఆలస్యమెందుకు.. మనమూ ఈ పద్ధతిని అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.