- పాలమీగడలో రెండు చుక్కల నిమ్మ రసం కలిపి స్నానానికి వెళ్లే ముందు రాసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పెసరపిండిలో గులాబీ నీళ్లు కలిపి ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే... మచ్చలు, మొటిమలు వంటివి తగ్గి ముఖం కాంతులీనుతుంది.
- కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే క్రమంగా చర్మఛాయ మెరుగుపడుతుంది.
- రెండు చెంచాల నిమ్మరసంలో చెంచా తేనె, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే... నలుపు తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.
- చుండ్రు ఇబ్బందిపెడుతున్నప్పుడు నిమ్మరసంలో రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. ఆపై ఆవిరి పట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. సమస్య దూరమవుతుంది.
ఇదీ చూడండి: Heart disease: గుండె జారిపోతోంది...పేదోళ్లకు గుండెజబ్బు వస్తే దిక్కేది?