ETV Bharat / lifestyle

మీకు తెలుసా...? తులసితో తళతళలాడే అందం! - తెలంగాణ వార్తలు

ఈరోజుల్లో నలుగురిలోనూ ప్రత్యేకంగా, అందంగా మెరిసిపోవాలని కోరుకోని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి?? నిజమే!! 'ఆ అందాన్ని సొంతం చేసుకోవడానికేగా బ్యూటీపార్లర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేది అంటారా?' అయితే మచ్చలేని సౌందర్యాన్ని సొంతం చేసుకోవడానికి రసాయనాలు కలిగి ఉండే సౌందర్య ఉత్పత్తులే కాదు.. సహజసిద్ధమైన పదార్థాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం ఇళ్లలో రోజూ చూసే 'తులసి' మొక్క కూడా!! అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే...!

basil-leaf-benefits-to-the-beauty-in-telugu
మీకు తెలుసా...? తులసితో తళతళలాడే అందం!
author img

By

Published : Mar 12, 2021, 12:29 PM IST

తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధిపడి మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తాజా ఆకులను మెత్తగా చేసుకొని మొటిమలపై రాసినా ఫలితం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో కూడా ఉడికించి చల్లార్చి ఆ ద్రావణాన్ని టోనర్‌గా వాడుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గడమే కాదు ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది. తులసి పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని మొటిమలు, ఇతర చర్మసంబంధ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా తులసి ఆకుల రసానికి పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.

basil-leaf-benefits-to-the-beauty-in-telugu
మెటిమలకు చెక్

నల్లమచ్చలకు నివారణ..

ముఖంపై నల్లని మచ్చలను నివారించడంలో తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసానికి అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రోజుకు ఒకసారి చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారడం ఖాయం.

దంత సౌందర్యానికి..

దంతాలు పసుపురంగు నుంచి తిరిగి తెల్లగా మారాలంటే... ఎండిన తులసి ఆకులను పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పొడిని నీళ్లతో కలిపి పళ్లపై పది నిమిషాలు రుద్దాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

తులసి నూనెతో..

నిగనిగలాడే శిరోజాల కేసం...

తులసి చర్మానికే కాదు శిరోజాల సౌందర్యానికి, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమే. కొందరు తలలో ఎక్కువగా చెమటలు పట్టడం, చుండ్రు, దురద, చిన్న చిన్న కురుపులు రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికి తులసి నూనె చక్కటి పరిష్కార మార్గం. దీనికోసం చేయాల్సిందల్లా తులసి ఆకులను పొడి చేసి (సుమారు పది స్పూన్ల పొడి), ఆ పొడిని ఒక డబ్బా కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయాలి. నూనె వేడెక్కడం మొదలయ్యాక అందులో కొన్ని మెంతులు వేయాలి. మెంతులు నూనెలో ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లార్చాలి. పొడిగా ఉన్న సీసాలో ఈ నూనెను భద్రపరచుకొని వారానికి రెండుసార్లు దీంతో మర్దనా చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. మెంతులు, తులసి కలిసి ఉండడం వల్ల శిరోజాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి.

తులసి లాభాలు

మరికొన్ని చిట్కాలు..

  • రోజూ 2, 3 తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పొడి చర్మం, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల నుంచి కచ్చితంగా ఉపశమనం పొందవచ్చు.
  • తులసి ఆకులు, గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసి 20 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం కాంతిని సంతరించుకుంటుంది.
  • తులసి రసాన్ని తాగడం వల్ల చర్మానికి, శిరోజాలకు, పళ్లకు చాలా మంచిది. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

తులసిలో ఇన్ని సౌందర్య, ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టే అనేక వాణిజ్య సంస్థలు తులసి మొక్క భాగాలను వారి ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నాయి. తులసిలోని అద్భుత గుణాలను మీరూ తెలుసుకున్నారు కదా.. ఏ ఖర్చూ లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే తులసి ఆకులను వినియోగించుకోండి.. మచ్చలేని అందాన్ని మీ సొంతం చేసుకోండి.

ఇదీ చదవండి: అవరోధాలు అధిగమించి.. అనుకున్నది సాధించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.