ETV Bharat / lifestyle

పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - పిల్లలకు కరోనా జాగ్రత్తలు

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా స్కూళ్లు మూతపడడంతో పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వాళ్ల అల్లరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పటికీ పలు కారణాల రీత్యా అవి అందరికీ చేరువ కాలేదనే చెప్పాలి. ఏదేమైనా తరగతుల వారీగా తిరిగి స్కూళ్లను తెరుస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం కోసం, వైరస్‌ నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించే చర్యలను చేపడుతున్నాయి. అయితే స్కూల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉంచమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. కొవిడ్‌ బారిన పడకుండా చిన్నారులతో తగిన జాగ్రత్తలు పాటింపజేయాలని చెబుతున్నారు. మరి, పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలంటే తల్లిదండ్రులు వారితో ఎలాంటి జాగ్రత్తలు పాటింపజేయాలి? ఇంకా ఎలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలి? తెలుసుకుందాం రండి..

children going to school again However these precautions are mandatory
పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
author img

By

Published : Feb 25, 2021, 7:00 AM IST

వ్యాక్సిన్‌ వచ్చినా కరోనాకు అంతం ఎప్పుడనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగని పనులన్నీ ఎన్నాళ్లని వాయిదా వేసుకొని ఇంట్లోనే కూర్చుంటాం? పిల్లలు కూడా ఎన్నాళ్లు స్కూలుకెళ్లకుండా ఇంటికే పరిమితమవుతారు? అందుకే కరోనాతో సహజీవనం చేయక తప్పదంటూ అందరూ తమ తమ విధుల్లో ఇప్పటికే మళ్లీ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో స్కూల్స్‌ కూడా తరగతుల వారీగా తెరచుకుంటున్నాయి. మొన్నటికి మొన్న 9, 10 తరగతులతో పాటు కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు 6, 7, 8 తరగతులు కూడా మొదలయ్యాయి. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు తిరిగి పాఠశాలకు రావచ్చంటూ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే మనకు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి తరుణంలో స్కూలుకెళ్లే పిల్లలు వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.

ఈ కనీస జాగ్రత్తలు తప్పనిసరి!

* వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఇన్నాళ్లూ ఇంట్లో ఎలాగైతే చేతులు శుభ్రంగా కడుక్కున్నారో.. స్కూల్లో కూడా చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పాలి. ఇందుకోసం ఇంటి నుంచే ఓ బాటిల్‌లో హ్యాండ్‌వాష్‌ తీసుకెళ్లడం మంచిది. లేదంటే స్కూల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్‌వాష్‌ పిల్లలంతా ఉపయోగిస్తారు కాబట్టి వైరస్‌ విస్తరించే ప్రమాదం ఎక్కువ. అలాగే మీ చిన్నారులు తీసుకెళ్లిన హ్యాండ్‌వాష్‌ కూడా ఇతర పిల్లలకు ఇవ్వకుండా ముందే ఓ మాట చెప్పి పంపండి.
* హ్యాండ్‌ శానిటైజర్‌ విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఎప్పుడూ తమ వద్ద శానిటైజర్‌ ఉంచుకొని చేతులు శుభ్రం చేసుకునే వీల్లేనప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోమని చెప్పండి. అలాగే దీన్ని కూడా ఇతర పిల్లలతో పంచుకోకూడదని వారికి అర్ధమయ్యేలా వివరించండి. అలాగని మరీ ఎక్కువగా ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే!

* ఇక మాస్క్ పెట్టుకోవడమన్నది వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త మాత్రమే కాదు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మన జీవితంలో ఓ భాగమైపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా రోజూ తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకునేలా.. తరగతి గదిలో, ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌ తొలగించకుండా ఉండమని వారికి చెప్పాలి. అలాగే దాన్ని ఎలా ధరించాలి, ధరించినప్పుడు తాకకుండా ఉండడం, తొలగించడం.. వంటివి కూడా వారితో ప్రాక్టీస్‌ చేయించాలి.
* ఇక రీ యూజబుల్‌ మాస్క్‌ అయితే వాటిని వేడి నీళ్లలో ఉతికేయడం, వాడి పడేసేదైతే మూత ఉన్న చెత్తడబ్బాలో పడేయాలన్న విషయం తెలిసిందే! దీని గురించి పిల్లలకు కూడా వివరించాలి.
* పిల్లల్లో రోగనిరోధక శక్తి పెద్ద వారితో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే సీజనల్‌ పండ్లు, కాయగూరలు, నట్స్‌, విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పదార్థాలు.. వంటి ఆహారంతోనే వారి రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, స్నాక్స్‌ తయారుచేయడం మంచిది.
* అలాగే వారికి ఇమ్యూనిటీని పెంచే కాఢా పానీయం, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు.. వంటివి ఉదయాన్నే తాగించడం మంచిది.
* పిల్లలు స్కూల్‌ క్యాంటీన్‌లో, బయటి పదార్థాలు తినకుండా చూసే బాధ్యత కూడా మీదే! ఈ క్రమంలో రోజూ రుచికరమైన ఇంటి భోజనంతో బాక్స్‌ కడుతూ.. బయటి పదార్థాలు తినడం అనారోగ్యకరమని, వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని వారికి వివరించి చెబితే వారు తప్పకుండా వింటారు.

* ఇక మధ్యాహ్నం భోజన సమయంలో చాలామంది పిల్లలు తమతో తీసుకొచ్చిన పదార్థాలు తమ స్నేహితులతో పంచుకుంటూ సరదాగా భోంచేస్తుంటారు. అయితే కొవిడ్‌ ఉన్న నేపథ్యంలో ఇలాంటి అలవాటు మంచిది కాదని పిల్లలకు చెప్పాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దూరం దూరంగా కూర్చొని తినమని చెప్పాలి.
* శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకూ అవసరమే! అందుకే రోజూ మీతో పాటే పిల్లలు కూడా ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసేలా వారిని ప్రోత్సహించాలి.
* స్కూలుకెళ్లే పిల్లలు సాయంత్రం ఆడుకునే సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా పిల్లలంతా కలిసి ఆడుకోకపోవడమే మంచిది.
* ఇక మీ పిల్లలు స్కూలుకెళ్లే క్రమంలో దగ్గు, జలుబు, జ్వరం.. వంటి అనారోగ్యాలకు గురైతే వారిని బడికి పంపించకుండా ఇంటి వద్దే ఉంచుకొని సంబంధిత డాక్టర్‌ వద్దకు వారిని తీసుకెళ్లడం శ్రేయస్కరం!

స్కూళ్లలో ‘హైబ్రిడ్‌ లెర్నింగ్’!

పిల్లలకు తరగతులు ప్రారంభించడమే కాదు.. వారు వైరస్‌ బారిన పడకుండా పాఠశాలల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘హైబ్రిడ్‌ స్కూల్‌ మోడల్‌’ పద్ధతిని అనుసరించాలని సూచిస్తున్నారు. అసలేంటీ పద్ధతి? అంటే.. పిల్లల్ని స్కూలుకు రప్పిస్తూనే వారితో సామాజిక దూరం పాటించేలా చేయడమన్నమాట! ఇందులో భాగంగా తరగతిలోని పిల్లలందరినీ ఒకేసారి రమ్మనడం కాకుండా కొంతమంది పిల్లలు ఒకరోజు, మరికొంతమంది మరో రోజు.. స్కూలుకు వచ్చేలా చేయడం వల్ల భౌతికదూరం పాటించడంతోపాటు వైరస్‌ ముప్పును తగ్గించచ్చంటున్నారు. అంతేకాదు..

* స్కూలుకొచ్చిన పిల్లల్ని కూడా తరగతి గదిలో దూరం దూరంగా కూర్చోబెట్టాలి.
* తరగతి గదులు, వాష్‌రూమ్స్‌, క్యాంటీన్‌, స్కూల్‌ పరిసరాలు, పిల్లల్ని తీసుకొచ్చే వాహనాలు/బస్సులు.. వంటివన్నీ ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడం తప్పనిసరి.
* తరగతి గదిలో పిల్లలతో పాటు టీచర్లు కూడా నిరంతరం మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే అందరూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలి.
* ఇక పిల్లల్లో కరోనా వైరస్‌, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం.. వంటి అంశాల గురించి అవగాహన పెంచేందుకు వాటికి సంబంధించిన పోస్టర్లను తరగతి గదిలోని గోడలకు అంటించాలి.

* పిల్లల్ని గేటు లోపలికి అనుమతించే క్రమంలోనే వారికి రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయడం మంచిది. తద్వారా ఎవరైనా పిల్లలు అనారోగ్యంతో ఉన్నా, జ్వరంతో బాధపడుతున్నా వారిని అటు నుంచి అటే ఇంటికి పంపించేయచ్చు. పాఠశాలల్లో ఈ ప్రక్రియ సక్రమంగా అమలవుతోందో లేదో పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తుండాలి.
* మధ్యాహ్నం లంచ్ సమయంలోను, వాళ్ల సందేహాలు నివృత్తి చేసే సమయంలోనూ, ఇతర సందర్భాల్లోనూ.. పిల్లలు గుమిగూడకుండా టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

సో.. ఇవండీ.. మన పిల్లలు స్కూలుకెళ్లే క్రమంలో వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు!. పిల్లలు వైరస్ బారిన పడకుండా ఉండేలా ఇతర పేరెంట్స్‌లో అవగాహన కలిగించండి.

ఇదీ చూడండి : లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.