ETV Bharat / lifestyle

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా? - world health organization

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అంతేకాదు.. ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ (చేతుల పరిశుభ్రతా దినోత్సవం) పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చేతులు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని చాలామంది పెడచెవిన పెడుతున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతిఒక్కరూ చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను నొక్కివక్కాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రత్యేకమైన రోజుకు బోలెడంత ప్రాధాన్యత సంతరించుకుంది.

hand sanitation, hand sanitation guidelines
హ్యాండ్ శానిటేషన్, హ్యాండ్​ శానిటైజేషన్
author img

By

Published : May 10, 2021, 4:27 PM IST

చాలామంది బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో కడుక్కున్నాంలే అన్నట్లుగా గబగబా చేతులు కడిగేసుకుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఏటా మే 5న ‘హ్యాండ్‌ హైజీన్‌ డే’ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో డబ్య్లూహెచ్ ఈ ఏడాది ‘Seconds save lives – clean your hands!’ అనే థీమ్‌తో మన ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. ఇటు వైరస్‌ బాధితుల్ని సంరక్షించుకుంటూనే, అటు ఇన్ఫెక్షన్‌ విస్తరించకుండా కాపాడాలంటూ పిలుపునిచ్చింది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని నొక్కివక్కాణించింది. అయితే ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అపరిశుభ్రమైన చేతుల కారణంగా ఆరోగ్యానికి బోలెడన్ని అనార్థాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నాయి. అవేంటంటే..!

ఏటా పది లక్షల మంది !

కరోనా కారణంగా ప్రస్తుతం అందరూ గంటకోసారి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మరి కరోనాకు ముందు కూడా ఇలాగే చేతులు కడుక్కునేవారా? అంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. ఓ అధ్యయనం ప్రకారం.. సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏటా పదిలక్షల మంది వివిధ అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారట.

చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో కుటుంబ సభ్యులు, స్నేహితులను తాకినా వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. చూశారుగా ఒకరి నిర్లక్ష్యం ఎంతమంది అనారోగ్యానికి కారణమవుతుందో! ఇక మొబైల్, టీవీ రిమోట్‌, ఇంట్లోని డైనింగ్‌ టేబుల్‌, తలుపులు, కిటికీలపై కూడా వ్యాధికారక క్రిములుంటాయి. ఒక టాయిలెడ్‌ కమోడ్‌పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఒక్క కరోనానే కాదు.. డయేరియా, హెపటైటిస్‌, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్‌, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ!

చిన్నారులు, ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోతే వారికి అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఫ్లూ బారిన పడి అమెరికన్లు ఏటా సుమారు 17 మిలియన్ల పని దినాలు కోల్పోతున్నారట. ఫలితంగా వారి ఆర్థిక వ్యవస్థకు సుమారు 7 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం సంభవిస్తోంది. ఇక ఇలాంటి ప్రమాదకర వైరస్‌ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి అమెరికన్లు ఏటా సుమారు 4.6 బిలియన్‌ డాలర్లను కేవలం హాస్పిటల్‌ ఖర్చులకే వెచ్చిస్తున్నారని ఓ అంచనా. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. ప్రపంచంలోని మిగిలిన దేశాలదీ ఇదే పరిస్థితి. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకుంటే ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

డయేరియా లాంటి అతిసార వ్యాధుల కారణంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఐదేళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. ప్రధానంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. పిల్లల చేతులు పరిశుభ్రంగా ఉంచడం వల్ల 10 మంది చిన్నారుల్లో కనీసం నలుగురు చిన్నారులను ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

చూపును కూడా కోల్పోతున్నారు!

చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రమాదకర కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఏటా సుమారు 6 మిలియన్ల మంది ప్రజలు కంటి కలకతో బాధపడుతున్నారట. ట్రకోమా లాంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా చాలామంది శాశ్వతంగా కంటిచూపును కోల్పోతున్నారట.

శరీరంపై గాయమైనప్పుడు కొన్ని ప్రమాదకర బ్యాక్టీరియాలు చర్మం, నాసికా రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కీళ్లు, ఎముకలు తదితర భాగాల్లోకి ప్రవేశించి రక్తాన్నంతటినీ కలుషితం చేసే ప్రమాదం ఉంది. ఫలితంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చేతులు సరిగ్గా శుభ్రం చేసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్‌లకు అడ్డుకట్ట వేయచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

‘సెప్సిస్‌’ అనే ఇన్ఫెక్షన్‌ కారణంగా ఏటా సుమారు 1.7 బిలియన్ల మంది అమెరికన్లు అస్వస్థతకు గురవుతున్నారని, అందులో సుమారు ఏటా 2.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే ఈ వ్యాధికి కారణమని అక్కడి ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.

చూశారుగా! చేతులు శుభ్రం చేసుకోకపోతే ఎలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయో!! ఇవే కాదు... ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కామెర్లు, నులిపురుగులు, టైఫాయిడ్‌, సార్స్‌, నిఫా, స్వైన్‌ఫ్లూ తదితర ప్రమాదకర వ్యాధులన్నీ చేతుల అపరిశుభ్రతతోనే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తున్నాయి. ప్రస్తుతం అందరినీ భయపెడుతోన్న కరోనాతో పాటు సమస్త వ్యాధులకు కళ్లెం వేయాలంటే చేతులు తరచూ శుభ్రం చేసుకోడమే సరైన మార్గం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.