నునుపుగా మారాలంటే :
ఐదారు బాదం గింజల్ని రాత్రి నానబెట్టి మర్నాడు కాస్త బరకగా పేస్టు చేయాలి. దీంట్లో రెండు చెంచాల తేనె, అరచెంచా పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి స్క్రబ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
తేమగా ఉండాలంటే :
నాలుగు చెంచాల బాదం పేస్టులో రెండు చెంచాల అరటిపండు గుజ్జు, చెంచా గులాబీనీరు కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. వారానికోసారైనా ఇలా చేస్తే ముఖం తేమగా, తాజాగా కనిపిస్తుంది.
మెరవాలంటే :
నానబెట్టి రుబ్బిన రెండు చెంచాల బాదం పేస్టులో చెంచా సెనగపిండి, కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట ఆరనివ్వాలి. తర్వాత వేళ్లను తడిచేసుకుని సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దనా చేయాలి. తరచూ ఇలాచేస్తే తేడా మీకే తెలుస్తుంది.
- ఇదీ చూడండి : పొడి చర్మానికి పరిమళ రక్ష