మూడు పెద్ద చెంచాల బియ్యప్పిండి, చెంచా తేనె, రెండు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పూతలా వేయండి. ఆపైనో మూడు నిమిషాలాగి వేళ్లను నీళ్లతో తడుపుకుంటూ రుద్దాలి. ఇలా ఓ పదిహేను నిమిషాలు చేస్తే సరి. వెనిగర్‌లోని ఆమ్లం మృతకణాలను మృదువుగా మారిస్తే.. బియ్యప్పిండి వాటిని సులభంగా తొలగిస్తుంది. తేనె యాంటీసెప్టిక్‌లా పనిచేసి పగుళ్లను తగ్గిస్తుంది.
తేమ అందించి...
బాగా మగ్గిన అరటిపండ్లను గుజ్జుగా చేసి, దానికి చెంచా పంచదార, కాస్త తేనె కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. పావుగంటయ్యాక నీటితో శుభ్రంగా కడిగేయాలి. అరటిపండు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇందులోని ఎ, బి6, సి విటమిన్లు చర్మానికి కావాల్సిన తేమను అందించి సమస్యను తగ్గిస్తాయి.