ETV Bharat / lifestyle

Health Tips in Telugu: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవి తినండి మరి!

అధిక బరువు ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న(weight loss technique) సమస్య. బరువును(obesity causes) తగ్గించడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. అందుకు కొందరు కడుపు మాడ్చుకుంటారు. ఫలితంగా ఇతర సమస్యల బారిన పడతారు. ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. బరువు తగ్గించుకోవాలనుకున్నా ఆహారం బేషుగ్గా తినొచ్చు. ఇంతకీ ఏం తినాలంటే..

Health Tips in Telugu, diet plan for weight loss
బరువు తగ్గడానికి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు
author img

By

Published : Oct 22, 2021, 11:46 AM IST

శరీరంలో కెలొరీలు పెరగాలంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటాం. కొన్ని రకాల ఆహారంతో కెలొరీలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ ‘నెగటివ్‌ కెలొరీ ఫుడ్‌’(diet plan for weight loss) గురించి తెలుసుకుందాం రండి...

రెండు రకాలు... కెలోరీలు రెండు రకాలు(Health Tips in Telugu). ఆహారం ద్వారా పెరిగే కెలోరీల్లో మొదటి రకంలో పోషక గుణాలు తక్కువగా ఉండి బరువును మాత్రమే పెంచడానికి సహకరిస్తాయి. రెండోరకంలో పీచు, నీరు అత్యధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. శరీరానికి వచ్చే కెలోరీల కన్నా జీర్ణమవడానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. ఈ నెగెటివ్‌ కెలోరీ ఫుడ్‌ మాత్రమే బరువు సమస్యను దూరంగా(Health Tips in Telugu) ఉంచుతుంది.

ఆకుకూరలో... సెలరీ ఆకు కూరలో పీచు ఎక్కువ. ఏ, సీ విటమిన్లు, ఫోలేట్‌ పుష్కలం. జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. తద్వారా శరీరం అతితక్కువ కెలొరీలు పొందుతుంది. అలాగే బ్లూ, స్ట్రా, రాస్‌బెర్రీస్‌ను అరకప్పు తీసుకుంటే వీటిలోని తక్కువస్థాయి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ), ప్రొటీన్లు కెలొరీలను పెంచవు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలను దరి చేరనివ్వవు.

కాయగూరలు... పీచు, పొటాషియం, సి విటమిన్‌, లైకోపిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టొమాటోతో బరువు తగ్గొచ్చు. క్యారెట్‌లో పీచు అధికం. తక్కువ తీసుకున్నా కడుపు నిండినట్టుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. బ్రొకోలీలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ కె, ఐరన్‌ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత రాకుండా కాపాడతాయి. మెదడును చురుకుగా ఉంచుతాయి. ముఖ్యంగా బరువు సమస్యను దూరం చేస్తుంది. కీరదోసలో నీటిశాతంతోపాటు విటమిన్లు, ఖనిజాలు, పీచు ఎక్కువ. ఇది జీర్ణమవడానికి అధిక శక్తి అవసరం.

పండ్లు.. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. అలాగే ఏ, బీ6, సీ విటమిన్లు, లైకోపిన్‌ ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. హృద్రోగాలను దరి చేరనివ్వదు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.

ఊబకాయానికి చెక్..

ఊబకాయం ఓ ఊబిలాంటిది. ఒక్కసారి దానిలోకి జారిపోవడం మొదలుపెట్టాం అంటే.. మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. ఇవాళ హైబీపీ, సుగర్​, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు లాంటి ప్రమాదకర ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా ఓ కారణంగా ఉంటుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో తినే ఆహారం విషయంలో (Diet Plan For Weight Loss) అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. తిన్న ఆహారాన్ని ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • తాజా పండ్లు, కూరగాయలను తరుచూ తీసుకుంటూ ఉండాలి.
  • వంటల్లో ఆలివ్ ఆయిల్​ ఉపయోగించడం ఉత్తమం. దీంతో మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి.
  • తృణధాన్యాలను తీసుకోవడం కూడా శరీరానికి చాలా మంచిది.
  • రోజూ ఒక యాపిల్​ పండును తినడం మంచిదన్నది వైద్యుల మాట.
  • టమాటాలు ఆహారంగా తీసుకోవడం కూడా మంచిది. దీనిలో విటమిన్ సీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్​ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని నిత్యం సూప్​, పప్పు, సలాడ్​, పండు రూపంలో తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.
  • స్వీట్లు, రైస్​ను వీలైనంత వరకు తగ్గించాలి. డ్రై ఫ్రూట్​ లాంటి వాటిని తీసుకోవచ్చు.
  • జామ, బొప్పాయి, పుచ్చకాయ లాంటి వాటిని తీసుకుంటే ఎక్కువ కొవ్వు చేరదు.
  • గోరువెచ్చని నీటిలో నిమ్మకాయి, తేనే వేసి పరగడుపునే తీసుకుంటే మంచిది.
  • ఉదయం అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో తినకుండా ఉండకూడదు.
  • దాహం వేసినా, వేయకున్నా.. తరచూ నీరు తాగుతూ ఉండాలి. మంచినీరు బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది.
  • క్యారెట్, బీట్​రూట్​ జ్యూస్​లు తీసుకోవడం బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మంచిది.
  • తరచూ బ్లాక్​ కాఫీ, గ్రీన్​ టీ తాగాలి.

ఇదీ చదవండి: Diet Plan For Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించాలా? ఇవి తినండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.