ETV Bharat / lifestyle

పండ్లు, కాయగూరలు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

వేసవి వచ్చిందంటే ఈ రోజు తెచ్చిన కూరగాయలు రేపటికే వాడిపోతాయి. అలాంటిది వారానికిి ఒకసారి కూరగాయలు తెస్తే మళ్లీ వారం వచ్చేలోపు వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాటిని ఫ్రిజ్‌లో భద్రపరిచినా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే మిగిలిన కాలాల్లోలాగా తాజాగా ఉంచుకోవచ్చు.

FRUITS
FRUITS
author img

By

Published : Mar 17, 2021, 1:47 PM IST

చాలామంది వారానికి సరిపడా కాయగూరలు, పండ్లను ఒకేసారి కొని ఇంటికి తెచ్చుకుంటారు. ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో పండ్లు, కాయగూరల్ని కొనడం వల్ల అవి వారం పాటు తాజాగా ఉండవు. మనం ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ ప్రత్యేకించి ఈ వేసవిలో కొన్ని కాయగూరలు వడలిపోయే అవకాశం ఉంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో అమర్చే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

precautions fresh vegetables in summer
కడిగి ఆరబెట్టిన తర్వాత
  • దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగించే కూరగాయ టొమాటో. అందుకే కిలోలకు కిలోలు వీటిని కొంటుంటారు చాలామంది. ఈ క్రమంలోనే అన్నీ పండినవి కాకుండా కొన్ని పచ్చిగా ఉన్న టొమాటోలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇలా పూర్తిగా పండని టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యకాంతి తగలకుండా నిల్వ చేస్తే రెండు మూడు రోజుల్లో పండుతాయి. అప్పుడు వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
    precautions fresh vegetables in summer
    కొనేముందు చూసుకోవాలి
  • వెనిగర్‌, ఉప్పు, చక్కెర కలిపిన మిశ్రమంతో.. బయటి నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను శుభ్రం చేసి.. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
    precautions fresh vegetables in summer
    ఆకుకూరలకు దూరంగా పండ్లను ఉంచాలి
  1. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇథిలీన్‌ వాయువును విడుదల చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. తద్వారా వీటి పక్కన నిల్వ చేసే ఇతర కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతాయి. కాబట్టి యాపిల్స్‌, ఆప్రికాట్స్‌, తర్బూజా.. వంటి ఇథిలీన్‌ విడుదల చేసే పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.
  2. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే జిప్పర్‌ బ్యాగ్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. అలాంటి బ్యాగులు అందుబాటులో లేకపోతే మామూలు కవర్లకే చిన్న చిన్న రంధ్రాలు చేయచ్చు. ఫలితంగా కాయగూరలకు గాలి తగిలి అవి కుళ్లిపోకుండా ఉంటాయి.
  3. ద్రాక్ష పండ్లను నిల్వ చేసే ముందు వాటిని నీటితో బాగా కడిగి.. తడిలేకుండా ఆరబెట్టాలి. అనంతరం టిష్యూ పేపర్లలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

* వెల్లుల్లిని గది ఉష్ణోగ్రత వద్ద తేమ తగలని ప్రదేశంలో నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.

* బంగాళాదుంపలు, ఉల్లిపాయలను సాధారణ బుట్టల్లో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

* ఇక కట్‌ చేసిన కాయగూరల్ని బేకింగ్‌ సోడా ద్రావణంలో కడిగి నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇలా శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము-ధూళి కూడా తొలగిపోతాయి.

  • అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం కంటే బయట ఉంచితేనే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి తొక్క త్వరగా నల్లగా మారుతుంది.
    precautions fresh vegetables in summer
    అరటికాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు
  • పుదీనా, కొత్తిమీర త్వరగా కుళ్లిపోవడం మనం గమనిస్తాం. అలా జరగకూడదంటే వాటిని పేస్ట్‌ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి.. ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.. లేదంటే వాటి కాడలను కత్తిరించి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

ఇదీ చదవండి: కరోనా కాలంలో సంపద సృష్టించిన వ్యవసాయరంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.