ETV Bharat / lifestyle

Dengue Alert: ఈ కారణాల వల్లే దోమల ఉద్ధృతి... అప్రమత్తత అవసరం

నగరవ్యాప్తంగా కొన్ని రోజులుగా పడుతున్న వానలకు ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు నిల్వ ఉంది. దోమల ఉద్ధృతి పెరిగింది. ముఖ్యంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఆసుపత్రికి నిత్యం 60-100 మంది డెంగీ లక్షణాలతో వస్తున్నారు. డెంగీ జ్వరమా... కరోనా... అని గుర్తించేలోపు పరిస్థితి విషమించి కొందరు మృత్యువాత పడుతున్నారు.

Dengue Alert
దోమల ఉద్ధృతి
author img

By

Published : Sep 7, 2021, 8:12 AM IST

గ్రేటర్‌ వ్యాప్తంగా గత రెండు నెలల్లో వేయి వరకు డెంగీ కేసులు నమోదయినట్లు సమాచారం. ఒక్క ఆగస్టులోనే హైదరాబాద్‌ జిల్లాలో 500 పైనే డెంగీ కేసులు నమోదయ్యాయి. చుట్టూ పరిసరాలే దోమల పెరుగుదలకు కారణమని ఎంటమాలజిస్టులు చెబుతున్నారు. టీ స్పూన్‌ నీటిలోనూ డెంగీ దోమ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పది రకాల కారణాలతో దోమల ఉద్ధృతి పెరుగుతోంది. వీటిపై అధికారులతోపాటు ప్రజలు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

దోమలు పెరిగే దారులు ఏంటంటే....?

1. పాత టైర్లు

Dengue Alert
దోమల ఆవాసాలు

నగరంలో ఎక్కడ పడితే అక్కడ పాత టైర్లు కన్పిస్తుంటాయి. ప్రధానంగా మెకానిక్‌ షాపుల వద్ద వీటికి కొదువ ఉండదు. వీటిని ఆరు బయటే వదిలేయడం వల్ల వర్షపు నీరు ఈ టైర్లలోకి చేరి దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. పనికిరాని టైర్లను ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకొని పునర్వినియోగానికి తరలించాలి.

2. నిలిపిన ఉంచిన పాత వాహనాలు

దోమల ఆవాసాలు

గ్రేటర్‌ వ్యాప్తంగా పనికి రాని వాహనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు, ఇతర లా అండ్‌ ఆర్డర్‌ స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వందల సంఖ్యలో పాత వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. ప్రమాదాల్లో గుర్తించినవి...దొంగ కేసుల్లో పట్టుబడినవి...వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలన్ని ఇక్కడకు తరలిస్తుంటారు. కోర్టుల్లో కేసులు తేలక అక్కడే ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉంటాయి. తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుకునేవి ఎన్నో. ప్రస్తుతం డెంగీ దోమలు పెరగడానికి ఇవి కూడా కారణమే. వీటిల్లో నీరు నిల్వ ఉండిపోతున్నాయి. అందులో దోమలు గుడ్లు పెడుతున్నాయి.

3. ఇంట్లో పాత సామగ్రి

దోమల ఆవాసాలు

ఇంట్లో పాత గొడుగులు, అట్టపెట్టెలు ఇలా పనికిరాని సామాగ్రి ఉంటుంది. వీటిని బయటే పడేసేందుకు చాలామంది ఇష్టపడరు. స్టోర్‌ రూమ్‌లోని చీకటి ప్రాంతంలో దోమలు ఉండిపోయి మనుషులపై దాడి చేస్తుంటాయి. అంతేకాక ఇంట్లో తడి వాతావరణం లేకుండా చూసుకోవాలి. తడి వల్ల ఫంగస్‌ పెరిగి వివిధ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

4. నీటి డ్రమ్ములు

దోమల ఆవాసాలు

బస్తీలు మురికివాడల్లో ఇళ్లల్లో సంపులు తక్కువ. దీంతో రెండు రోజులకొకసారి వచ్చే నీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో నిల్వ చేస్తుంటారు. వీటికి ఎలాంటి మూతలు ఉండవు. డెంగీ దోమలు ఈ మంచినీటిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి డ్రమ్ములు, బకెట్లపై మూతలు పెట్టాలి. వారానికి ఒకసారి వీటిని ఖాళీ చేసి ఎండబెట్టాలి.

5. తాగిపడేసిన కొబ్బరిబోండాలు

దోమల ఆవాసాలు

నగరంలో కొబ్బరి బొండాల దుకాణాలు ఎక్కువ. తోపుడు బండ్లపైనా అమ్ముతుంటారు. తాగేసిన తర్వాత ఈ బోండాలన్ని మూటగట్టి కాలనీల్లోని ఖాళీ ప్రదేశాలు లేదంటే నిర్మాన్యుషంగా ఉన్న రైల్వే ట్రాక్‌ల వద్ద పడేసి వెళుతుంటారు. వర్షం పడితే ఈ ఖాళీ కొబ్బరి బోండాల్లోకి వర్షపు నీరు చేరి దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. వీటిని విక్రయించే వ్యాపారులకు సూచనలు చేసి ఖాళీ బోండాలు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.

6. ప్లాస్టిక్‌ గ్లాసులు, సీసాలు

దోమల ఆవాసాలు

టీ దుకాణాల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌ లేదంటే కాగితంతో చేసిన గ్లాసులను వాడుతుంటారు. ప్లాస్టిక్‌ సీసాలు సరేసరి. ఇవన్నీ ఖాళీ ప్రదేశాల్లోకి చేరుతుంటాయి. వీటిల్లోకి వాన నీరు చేరి దోమల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసి డంపింగ్‌ యార్డుకు తరలించాల్సి ఉంది.

7. రహదారులపై గుంతలు

దోమల ఆవాసాలు

వానల కారణంగా ప్రధాన రహదారులపై, అంతర్గత రోడ్లపై గోతులు ఏర్పడ్డాయి. వీటిలో వర్షపు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటోంది. దోమల సంతతి పెరుగుతోంది. ఈ గోతులను ఎప్పటికప్పుడు మట్టితో కప్పేయాలి. నీరు నిల్వ ఉన్నచోట దోమల మందు పిచికారి చేయాలి.

8. పూల కుండీలు

దోమల ఆవాసాలు

నగరంలో లక్షల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లో పూలకుండీలు సాధారణమే. డెంగీ లాంటి దోమల పెరుగుదలకు ఇవి కీలకం. పూల కుండీల్లో కింద పెట్టిన పేట్లలో నీళ్లు నిల్వ ఉండిపోయి... అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. ఈ ప్లేట్లతోపాటు కుండీల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి.

9. మురుగు నీటి కాల్వలు

దోమల ఆవాసాలు

ఇళ్ల పక్క నుంచే నాలాలు పారుతున్నాయి. వీటిల్లో పూడిక సరిగా తీయడంలేదు. నగరం పొడవునా మూసీ నది వెళుతోంది. ఇందులో చెత్త సంగతి చెప్పనవసరం లేదు. మలేరియా, గన్యా లాంటి జ్వరాలకు కారణమయ్యే దోమల పెరుగుదలకు ఇవి దోహదపడుతున్నాయి.

డెంగీ కేసుల వివరాలు

10. నీటి కుంటలు: నగరం చుట్టూ చెరువులు ఉన్నాయి. చిన్నచిన్న నీటి కుంటలకు కొదువ లేదు. డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ ఇలాంటి నీటిలోనే పెరుగుతుంది. వ్యాధికి కారణమయ్యే పారాసైట్‌ను మోసుకు వెళుతూ మనుషులను కుట్టి జ్వరాలను వ్యాపింప చేస్తున్నాయి. నీటి కుంటలు, చెరువుల్లో డ్రోన్ల ద్వారా మందులను పిచికారి చేస్తే దోమల లార్వాను అరికట్టవచ్చు.

ఇదీ చూడండి: Rainfall Warning: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రానికి అత్యంత భారీ వర్షసూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.