ETV Bharat / lifestyle

జుట్టు పొడిబారుతోంది.. కుంకుడు కాయలతోనే సమస్యా? - జుట్టు పొడిబారకుండా చిట్కాలు

ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చినా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తున్నాను. కానీ జుట్టు బాగా పొడిబారిపోతోంది. అసలు తలస్నానానికి కుంకుడు కాయలు మంచివా.. కాదా? అంటూ ఓ సోదరి అడిగిన ప్రశ్నకు ప్రముఖ కాస్మటాలజిస్ట్ శైలజ సూరపనేని ఏం చెప్పారంటే..

is hair becoming dry because of soapnuts
జుట్టు పొడిబారుతోంది.. కుంకుడు కాయలతోనే సమస్యా?
author img

By

Published : Aug 4, 2020, 9:33 AM IST

తేమతో కూడిన ప్రాంతంలో ఉన్నప్పుడు జుట్టు పొడిబారదు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది. అందువల్ల సహజంగానే ఇక్కడ జుట్టు పొడిబారుతుందిగానీ కుంకుడుకాయల వల్ల కాదు. ఇవి వందశాతం సహజసిద్ధమైనవి. ఈ రసం పురుగులు,దోమలు రాకుండా నివారిస్తుంది కూడా. అయితే దీనికి కొంత అలర్జీ అనేది ఉంటుంది. అందుకే ఈ రసం కంట్లో పడితే కనురెప్పలు వాయడం, మండటం జరుగుతుంది. కానీ కొన్ని గంటల్లో పరిస్థితి మామూలుగా అయిపోతుంది. అతి తక్కువమందికే వీటివల్ల అలర్జీ వస్తుంది. ఎలాంటి చికిత్సా అవసరం లేకుండానే తగ్గిపోతుంది కూడా. వీటిల్లో విటమిన్‌-ఎ, డి, ఇ, కె ఉండటం వల్ల వీటిని వాడితే ఎన్నో లాభాలుంటాయి.

మీకు ఆయిల్‌ ప్రొడక్షన్‌ తక్కువగా ఉండటం వల్లే జుట్టు పొడిబారుతుంది. కుంకుడు కాయలతో వారానికి ఒక్కసారే తలస్నానం చేసి తప్పనిసరిగా కండిషనర్‌ పెట్టుకోవాలి. లేదా జుట్టు తడిపొడిగా ఉన్నప్పుడే షియాబటర్‌ రాసుకోవాలి. కుంకుడు కాయలను మానేయాల్సిన అవసరం లేదు. అయితే వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి.

ముందురోజు రాత్రి.. గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించి మృదువుగా మర్దనా చేసుకుని ఉదయాన్నే కుంకుడు రసంతో తలస్నానం చేసి కండిషనర్‌ పెట్టుకుంటే జుట్టు మెత్తగా అవుతుంది. మందార ఆకులను మెత్తని పేస్టులా చేసి దాన్ని కుంకుడు రసంలో కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలు మృదువుగా ఉంటాయి. తలస్నానం ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లతోనే చేయాలి. జుట్టును తువ్వాలుతో గట్టిగా తుడవకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.