ETV Bharat / lifestyle

హోలీ వేడుకలు.. మానేస్తే బెస్ట్.. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి!

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పండగే ‘హోలీ’. ఈ సందర్భంగా ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ, సంతోషమనే రంగు నీటిలో మునిగి తేలుతూ అందరూ తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వార్తల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు హోలీ వేడుకలను నిషేధించగా.. మరికొన్ని రాష్ట్రాలు సంబరాలపై ఆంక్షలు, పరిమితులను విధిస్తున్నాయి.

not to celebrate Holi is better
హోలీ వేడుకలు మానేస్తే బెస్ట్..
author img

By

Published : Mar 28, 2021, 9:57 PM IST

Updated : Mar 28, 2021, 10:17 PM IST

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న ఈ క్రమంలో- ఈసారి హోలీ సంబరాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. లేదంటే - ఇంట్లోనే, అది కూడా కుటుంబ సభ్యులతోనే హోలీ ఆడుకోవడం కొంతవరకు శ్రేయస్కరం. ఇలా కుటుంబ సభ్యులతోనే కలిసి హోలీ జరుపుకొంటున్నా సరే - ఓ వైపు కరోనా నుంచి జాగ్రత్తపడుతూనే.. మరోవైపు రంగుల ప్రభావం మనపై పడకుండా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

కరోనా నుంచి కాపాడుకుంటూ!

handwashtips650-10.jpg
కరోనా నుంచి కాపాడుకుంటూ!

తగ్గిందనుకుంటున్న కరోనా వైరస్‌ మళ్లీ బుసలు కొడుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని కొన్ని నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోగా, మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి జరుపుకొనే హోలీ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలో ఎక్కువమంది గుంపులుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటూ, మాస్కులు ధరించాల్సిందేనని వారు సూచిస్తున్నారు. హోలీ సందర్భంగా వందలాది మంది ఒకే చోట గుమిగూడడం, కొన్ని ఈవెంట్‌ సంస్థలు ఏర్పాటు చేసే రెయిన్‌ డ్యాన్స్‌.. వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొని ఎంజాయ్‌ చేయడం సర్వసాధారణమే. అయితే ఎక్కువ మంది గుమిగూడిన చోట వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ఒకవేళ ఆ గుంపులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారు దగ్గడం, తుమ్మడం వల్ల అది మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఇంటి ముంగిట్లో.. అది కూడా మన కుటుంబ సభ్యులతోనే కలిసి హోలీ ఆడుకోవడం శ్రేయస్కరమంటున్నారు వారు. ఇక సంబరాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ముక్కు, ముఖం కవరయ్యేలా మాస్క్‌ను ధరించాలని సూచిస్తున్నారు. ఇక వేడుకల్లో సహజ రంగులనే ఉపయోగించడం ఉత్తమం. హోలీ ముగిసిన తర్వాత ఒకవేళ దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలేవైనా కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

చర్మం, జుట్టు సంరక్షణ ఇలా!

holicelebrationsghg650-1.jpg
చర్మం, జుట్టు సంరక్షణ ఇలా!

* హోలీ ఆడటానికి కేవలం సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలి. అయితే నేచురల్ రంగులుగా మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల రంగుల్లో రసాయన అవశేషాలుంటున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉదాహరణకు హెన్నాను మనమంతా సహజసిద్ధమైన రంగుగానే భావిస్తాం.. కానీ బ్లాక్ హెన్నాలో పారాఫినైలెన్డయమిన్ (పీపీడీ) అనే రసాయనం కలిసి ఉంటుంది. అది చాలామందిలో ఎలర్జీని కలగజేస్తుంది.
* హోలీ ఆడటానికి ముందే గోళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్ వేసేయాలి. దీని వల్ల గోళ్లలోకి రంగుల ప్రభావం పోకుండా ఉంటుంది. లేదా కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ చెంచా చొప్పున తీసుకొని అందులో గోళ్లను ముంచి కాసేపు ఉంచాలి.
* హోలీ ఆడే క్రమంలో ఎండ తగులుతుంది. కాబట్టి చర్మం మరింత నల్లబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే చర్మానికి 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
* పెదాలకు లిప్‌బామ్‌ని దట్టంగా రాసుకోవాలి. హోలీ ఆడిన తర్వాత లిప్ బామ్ కూడా పోయేలా పెదవుల్ని కడిగి తుడుచుకోవాలి.
* హోలీ రంగుల వల్ల చర్మం తర్వాత ఎక్కువగా పాడయ్యేది జుట్టు.. అందుకే హోలీకి ముందు రోజు రాత్రే తలకు నూనె పట్టించి మర్దనా చేయాలి. హోలీ ఆడేటప్పుడు కూడా గట్టిగా జడ వేసుకోవడం వల్ల జుట్టు పైన ఎక్కువగా రంగు పడకుండా ఉంటుంది.
*తలలో చుండ్రు, ఇతరత్రా సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. హోలీ ఆడే సమయంలో తలకు ఏదైనా క్లాత్‌ కట్టుకోవడమో, క్యాప్‌ పెట్టుకోవడమో చేయాలి.
*హోలీ ముందు రోజు శరీరానికి ఆముదం రాసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం లోపలికి వెళ్లకుండా ఉండటమే కాదు.. రంగులు తొందరగా తొలగిపోతాయి.
* హోలీ ఆడిన తర్వాత కూడా క్లెన్సర్‌తో చక్కగా రంగులను క్లీన్ చేసుకోవాలి. ఎక్కడా రంగుల అవశేషాలు మిగలకుండా జాగ్రత్త పడాలి. ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్ల పాలపొడి, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తీసుకొని దాన్ని చర్మానికి పట్టించి క్లీన్ చేసుకుంటే రంగులు ఈజీగా తొలగిపోతాయి. ఆ తర్వాత శరీరానికి మంచి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి.
* హోలీ ఆడిన తర్వాత ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకొని ఒక గంట సేపు ఆగిన తర్వాత స్నానం చేయడం వల్ల రంగులన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ రంగుల వల్ల అలర్జీలు తలెత్తకుండా ఉంటాయి.
* శెనగపిండి, స్వీట్ ఆయిల్, మీగడ, రోజ్‌వాటర్‌లతో చిక్కని పేస్ట్ తయారుచేసి ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద అప్త్లె చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకుంటే చర్మం మీద వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి.
* హోలీ ముందు లేదా తర్వాత కొద్ది రోజుల పాటు బ్యూటీ ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండడం మంచిది.
* హోలీ ఆడే క్రమంలో శరీరాన్ని పూర్తిగా కవర్ చేస్తూ ఉండే దుస్తులు ధరించడం మంచిది. దీని వల్ల చర్మానికి రంగుల వల్ల ఎక్కువ హాని జరగకుండా కాపాడుకోవచ్చు.

కళ్లు జాగ్రత్త..!

holicoronagh650-1.jpg
కళ్లు జాగ్రత్త..!

* హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ఈ క్రమంలో కళ్లలో రంగులు పడినట్లయితే వాటిని ఎక్కువ నీళ్లతో తరచుగా కడుగుతూ ఉండాలి. హోలీ ఆడడం పూర్తయిన తర్వాత కళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని పడుకున్నా కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
* మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వీటిపై రంగులు పడితే అది కమిలిపోయి ఆ ప్రభావం కంటి చూపుపై పడుతుంది. అందుకే హోలీ ఆడే ముందే కొబ్బరి, బాదం నూనెలను కళ్ల చుట్టూ రాసుకోవాలి.
* ఒకవేళ కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, పుసులు కట్టడం, దురద, రక్తం కారటం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా తక్షణం నిపుణులైన నేత్ర వైద్యులను సంప్రదించాలి.
* కంట్లో రంగులు పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎవరైనా రంగులు వేస్తే కళ్లు, పెదాలు గట్టిగా మూసి వేయడం ద్వారా ప్రమాదం నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు.
* కళ్లలో రంగులు పడితే ఎట్టి పరిస్థితిలో నలపకూడదు. ఇలా చేయడం వల్ల నేత్రాలకు మరింత నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
* వాటర్‌ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో కళ్లలోకి కొట్టడం ద్వారా ఎక్కువ గాయాలవుతాయి. కొన్నిసార్లు కళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. కటకాలు దెబ్బతినడం, స్థానభ్రంశం చెందడం, రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. కళ్లలో చిక్కుకున్న అవశేషాలను చేతి రుమాలు, టిష్యూ పేపర్‌ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తే అది మరింత నష్టం కలిగిస్తుంది.
* హోలీలో పాల్గొంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడకపోవడం ఉత్తమం. కొన్ని లెన్స్‌లు నీటిని పీల్చుకుంటాయి. ఇవి కంటిలో చిక్కుకుపోతే అలర్జీలు, అంటు వ్యాధులు రావడంతో పాటు కంటి చూపుకి నష్టం చేసే అవకాశం ఉంది.
* డాబాలు, మేడలపై, అపార్ట్‌మెంట్ల టెర్రస్‌పై హోలీ ఆడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఈ సందడిలో మునిగి కాలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి.
* ప్రమాదవశాత్తు రంగు పడితే ముఖాన్ని కిందకు దించి కళ్లను తెరిచేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో కళ్లల్లో నీళ్లు కొట్టకూడదు. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. దోసిట్లో నీటిని తీసుకొని అందులో ముఖం పెట్టి కళ్లను నెమ్మదిగా తెరవాలి.

మళ్లీ గుర్తుంచుకోండి. కరోనా నేపథ్యంలో- ఈసారి హోలీ సంబరాలకు దూరంగా ఉంటేనే అన్ని రకాలుగా మంచిది. అలా కాదు.. కుటుంబ సభ్యులతోనే కలిసి హోలీ జరుపుకొంటామంటే మాత్రం - కనీసం పైన చెప్పిన జాగ్రత్తలు తు.చ. తప్పకుండా పాటించండి.

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం

Last Updated : Mar 28, 2021, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.