మొక్కజొన్నలో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి12, ఇనుము, ఫోలిక్ యాసిడ్లు రక్తహీనతను దూరం చేస్తాయి.
మొక్కజొన్నలో ఉండే పాంటోథైనిక్ ఆమ్లం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది.
ఇది రక్తంలోని ఎర్రరక్త కణాల వృద్ధికి సాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం, రక్తపోటు లాంటి సమస్యలను నియంత్రిస్తుంది.
ఇందులో ఉండే ఫాస్ఫరస్ మూత్ర పిండాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
దీంట్లోని మెగ్నీషియం ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోకుండా చేస్తాయి.