* వన్యప్రాణుల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాపించిన సంగతి తెలిసిందే. మనుషుల నుంచీ వన్యప్రాణులకు వ్యాపిస్తుందని చాలా అధ్యయనాలు గతంలో సూచించాయి. మనుషులున్న చోటల్లా వైరస్ ఉంది. కొవిడ్ వైరస్ ముప్పు వన్యప్రాణుల నుంచి పెంపుడు జంతువుల వరకు అన్నింటికీ పొంచి ఉంది.
* హైదరాబాద్ జూలోని సింహాలు కొవిడ్ బారిన పడటమే మన దేశంలో మొదటి కేసు. ఇతర దేశాల్లో ఇదివరకే ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. కొన్ని దేశాల్లో మింక్ జంతువులు కొవిడ్ బారినపడి పెద్దసంఖ్యలో మృత్యువాత పడ్డాయి. మరికొన్ని దేశాల్లో మనుషులకు వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు వాటిని చంపిన ఉదంతాలున్నాయి. భారత్‌లో జంతువులకు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి అయినందువల్ల ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి.
* జంతువులకు వైరస్ సోకకుండా జంతు ప్రదర్శనశాలల్లో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
* కొవిడ్ ఉద్ధృతి తగ్గేవరకు కుక్కలు, పిల్లులతో జాగ్రత్తగా ఉండటం మేలు. వాటిలో వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా పరీక్ష చేయించడం మంచిది.
* దేశవ్యాప్తంగా వన్యప్రాణులకు సంబంధించి కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు 4 ల్యాబ్‌లను ఎంపిక చేశారు. వాటిలో అత్తాపూర్‌లోని లాకోన్స్ ఒకటి. అటవీ శాఖ, జూ తదితర ప్రభుత్వ ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చే వన్యప్రాణుల నమూనాలనే ప్రస్తుతం పరీక్షిస్తున్నాం. పెంపుడు జంతువులకు సంబంధించి పరీక్ష విధానాలను అభివృద్ధి చేస్తున్నాం.
ఇదీ చూడండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం