ETV Bharat / lifestyle

బరువు తగ్గాలంటే ఈ పద్ధతులే బెస్ట్! - బరువు తగ్గడం ఎలా

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని వదిలించుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మరికొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకుని, శరీరాన్ని కష్టపెట్టి బరువు తగ్గించుకునే బదులు కొన్ని సంప్రదాయ ఆహార పద్ధతులు పాటించడం ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అనాదిగా వస్తున్న ఈ అలవాట్లు నేటితరంలో కొందరికి కొత్తగా కనిపించవచ్చేమో కానీ పాటిస్తే మాత్రం కచ్చితంగా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వారు చెబుతున్నారు. మరి ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న ఆ సంప్రదాయ ఆహార పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

amazing-tips-for-weight-loss
బరువు తగ్గాలంటే ఈ పద్ధతులే బెస్ట్!
author img

By

Published : Mar 30, 2021, 12:52 PM IST

రోజంతా చురుగ్గా పని చేయాలంటే పోషక విలువలున్న బ్రేక్‌ఫాస్ట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం తప్పనిసరి. అయితే సమయం లేదనో, వివిధ కారణాల వల్లనో చాలామంది ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ‘రెడీ టు ఈట్‌’ ఫుడ్స్‌ను అల్పాహారంగా తీసుకుంటుంటారు. దీనివల్ల సమయం కలిసొస్తుంది కానీ శరీరానికి మాత్రం చేటు తప్పదు. వీటి బదులు ఇంటి వద్ద తయారుచేసిన బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పోషకాలు సమృద్ధిగా ఉన్న పోహా, ఉప్మా వంటి సంప్రదాయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

పండ్లు, కూరగాయలు

సులభంగా, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు తగ్గాలంటే రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు భాగం చేసుకోవాల్సిందేనంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో విరివిగా లభించే ఫైబర్‌, పీచు పదార్థాలు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి.

గింజలు, నట్స్

రోజూ గుప్పెడు నట్స్, గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. ఇవి శరీర బరువును ఏ మాత్రం పెంచకుండా ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. అయితే క్యాలరీలు తక్కువగా ఉండే నట్స్‌ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

గ్యాడ్జెట్లకు దూరంగా..

మనలో చాలామందికి మొబైల్‌, టీవీ చూస్తూ తినే అలవాటు ఉంటుంది. మరికొందరు పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు చదువుతూ ఏదో ఒకటి తింటుంటారు. వీలైనంతవరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండడం మేలు. అప్పుడే మనసు పెట్టి తింటారు. తొందరగా కడుపు నిండుతుంది కాబట్టి ఎక్కువగా కూడా తినరు. ఇక టీవీ చూస్తూ తినే అలవాటు దూరం చేసుకోకపోతే జీర్ణ సమస్యలతో పాటు తొందరగా బరువు పెరిగే ప్రమాదముంది.

రాత్రి భోజనం

రాత్రి వేళల్లో సాధ్యమైనంతవరకు తేలికైన ఆహారాన్నే తీసుకోవాలి. అది కూడా నిద్రకు ఉపక్రమించే రెండు లేదా మూడుగంటల ముందే తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది.
తగిన మోతాదులో మంచినీళ్లు!
రోజుకు కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల మంచినీళ్లు తప్పకుండా తాగాలి. ఫలితంగా డీహైడ్రేషన్‌, ఒంట్లో మలినాలు పేరుకుపోవడం, అలసట, తలనొప్పి లాంటి సమస్యలు దరిచేరవు. అదేవిధంగా మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
సో.. చూశారుగా.. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో. మరి మీరు కూడా ఈ టిప్స్‌ను ట్రై చేయండి. నాజూగ్గా మారండి.

ఇదీ చూడండి: బాదం తినండి.. బరువు తగ్గండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.