* రెండు చెంచాల అరటిపండు గుజ్జులో చెంచా కలబంద గుజ్జు, కాస్త తేనె కలిపి ముఖానికీ, మెడకూ పూత వేసుకోవాలి. ఇది పొడిబారిన చర్మానికి సాంత్వన అందిస్తుంది.
* రెండు చెంచాల వేపాకు ముద్దలో చెంచా చొప్పున కలబంద గుజ్జు, గులాబీ నీరు... కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
కలబందలోని జెల్ చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు శరీర లోపలి భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కలబంద జెల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే దద్దుర్ల వంటి వాటిని పోగొడుతుంది. మంచి మాయిశ్చరైజర్‌లాగా కూడా పనిచేస్తుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. కూలింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.