ETV Bharat / lifestyle

క్వీన్​ ఆఫ్​ సౌత్​ ఇండియాగా విశాఖ యువతి భవానీ - క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కిరీటం వార్తలు

ఫ్యాషన్ రంగం ఎప్పుడూ యువతను ఆకర్షిస్తూనే ఉంటుంది. దేశంలో వివిధ సంస్ధలు నిర్వహించే పోటీలు యువతకు ఈ రంగంలో కొత్త అవకాశాలను పరిచయం చేస్తుంటాయి. ఈ కోవలోనే కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా పోటీలో ఏపీ విశాఖకు చెందిన భవానీ దుర్గ టైటిల్ దక్కించుకుంది. వెండితెరకు పరిచయమయ్యే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంది. ఈ రంగంలో మరిన్ని పోటీలకు వెళ్లి తనకు ఉన్న అభిరుచి ద్వారా సత్తా చాటుతానని చెబుతోంది ఈమె.

క్వీన్​ ఆఫ్​ సౌత్​ ఇండియాగా విశాఖ యువతి భవానీ

author img

By

Published : Sep 15, 2020, 10:44 PM IST

Updated : Sep 15, 2020, 10:50 PM IST

క్వీన్​ ఆఫ్​ సౌత్​ ఇండియాగా విశాఖ యువతి భవానీ

క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన అమ్మాయి దక్కించుకుంది. ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈవో జాన్‌ అమలాన్‌ సారథ్యంలో ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా కింగ్‌ అండ్‌ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా 2020 ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో గాజువాక మండలం కూర్మన్నపాలేనికి చెందిన కె.భవానీ దుర్గ క్వీన్‌ కిరీటం సాధించింది. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన మగువలు పాల్గొన్నారు.

మొదటి రౌండ్‌లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్‌లో ర్యాంప్‌ వాక్, మూడో రౌండ్‌లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు సంధించారు. పోటీల ఫలితాలు గత నెల 30న వెలువడ్డాయి. మూడు విభాగాల్లో భవానీదుర్గా ప్రతిభ చూపి క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైంది. భవానీ నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతోంది. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల ప్రోత్సాహంతో తనకు ఈ అరుదైన గుర్తింపు లభించిందని భవానీదుర్గా అంటోంది. తనకు వెండితెరపైన కూడా ఛాన్స్ రావడంతో భవానీ అనందం వ్యక్తం చేస్తోంది.

ఈ తరహా పోటీలలో తమ కుమార్తె విజయం సాధించడం తమకు సంతోషంగా ఉందని తండ్రి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. యువత తమ అభిరుచులకు అనుగుణంగా తమ కెరీర్ ని తీర్చి దిద్దుకుంటున్నారని.. తమ కుమార్తెకు కావాల్సిన ప్రోత్సాహం ఇస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: 'అంతర్వేది ఘటన తర్వాత అప్రమత్తమైన తితిదే అధికారులు'

Last Updated : Sep 15, 2020, 10:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.