ETV Bharat / lifestyle

జంతు ప్రేమికుల కోసం.. అహింసా లెదర్‌ వచ్చిందోచ్‌!

ఒక్కరోజుకే వాడి రాలిపోయే పువ్వుల్ని కోసి జడలో పెట్టుకుంటున్నందుకే ‘ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి...’ అంటూ పువ్వుల బాధని వర్ణించారు ఒక కవి. మురిపించే బ్యాగుల కోసం, ముచ్చటైన బూట్లకోసం... కోట్లాది ప్రాణుల్ని మనం పెడుతున్న హింస గురించి తెలిస్తే ఇంకేమనేవారో మరి. కవుల దాకా ఎందుకు మేమున్నాంగా... అంటున్న ‘పెటా’ సంస్థ ఆ మూగప్రాణుల తరఫున చేస్తున్న పోరాటం వల్ల ఇప్పుడు లెదర్‌కి అర్థమే మారిపోయింది. జంతువులతో సంబంధం లేని వీగన్‌ లెదర్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఆకులూ పూలూ పండ్లూ కావేవీ లెదర్‌ తయారీకి అనర్హం... అని పరిశోధకులు అంటుంటే దాంతోనే యాక్సెసరీలన్నీ డిజైన్‌ చేసేస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.

author img

By

Published : Jan 24, 2021, 12:56 PM IST

vegan leather accessories are the new trend in India
అహింసా లెదర్‌ వచ్చిందోచ్‌!

మెత్తగా చేతుల్లో ఒదిగిపోయే లెదర్‌ బ్యాగు మోడల్‌ నచ్చితే ధర చూస్తాం. తాహతు ఉంటే కొనేస్తాం. కానీ దాని తయారీ వెనకాల ఉన్న కథ గురించి క్షణకాలం కూడా ఆలోచించం. ఏటా 140 కోట్ల జంతువుల్ని కేవలం వాటి చర్మం కోసం చంపుతున్నారనీ, అందుకోసం బతికున్న జంతువుల్ని సరైన తిండీ తిప్పలూ పెట్టకుండా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వేర్వేరు దేశాలకు రవాణా చేస్తుంటారనీ అంటోంది జంతువుల హక్కులకోసం పోరాడుతున్న పెటా. ఆ హింస సంగతి పక్కన పెడితే...
మనిషికీ ప్రకృతికీ కూడా ‘లెదర్‌ ఈజ్‌ ఎ కెటాస్ట్రఫీ అంటే- పెను విపత్తు’ అంటున్నారు దానికి ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తున్న పరిశోధకులు. ఎందుకనీ అంటే- జంతువుల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. మీథేన్‌ కాలుష్యం పెరుగుతోంది. జంతుచర్మాన్ని ఉపయోగపడే లెదర్‌గా మార్చే క్రమంలో ట్యానింగ్‌ పరిశ్రమలు పలురకాల రసాయనాలను నేలమీదా నీళ్లలోకీ వదలడంతో అవి కలుషితమవుతున్నాయి. ఆహారం ద్వారా తిరిగి మన శరీరంలోకి వెళ్తున్నాయి. అంతేకాదు, లెదర్‌ తయారీలో వాడిన రసాయనాల ప్రభావం ఆయా వస్తువుల్ని వాడుతున్నంత కాలం మనమీద కూడా ఉంటుందట. ఇన్ని రకాలుగా దుష్ప్రభావం చూపుతున్నందుకే అది పెను విపత్తు అయింది.
ఇలా మనిషికీ ప్రకృతికీ భారంగా మారుతున్న లెదర్‌ పరిశ్రమకు ప్రత్యామ్నాయమే వీగన్‌ లెదర్‌. ఇప్పుడు ఫ్యాషన్‌ పరిశ్రమ దీని చుట్టూనే తిరుగుతోంది.

వీగన్‌ లెదరా... అంటే?

vegan leather accessories are the new trend in India
వీగన్ లెదర్

జంతువులతో ఏమాత్రం సంబంధం లేనిది అని సూటిగా చెప్పడానికి దీనికా పేరు పెట్టారు కానీ నిజానికి ఇందులో రెండు రకాలున్నాయి. ఇప్పటివరకూ ప్లాస్టిక్‌తో తయారైన ఫాక్స్‌ లేదా సింథటిక్‌ లెదర్‌ని జంతుచర్మానికి ప్రత్యామ్నాయంగా భావించేవారు. పీవీసీ(పాలీ వినైల్‌ క్లోరైడ్‌) అనేది అందుబాటులో ఉండే, ఎక్కువగా వాడే ప్లాస్టిక్‌ రూపం. రకరకాల రసాయనాల సాయంతో దీనికి లెదర్‌ రూపం తెస్తారు. చౌకగా లభించడం వల్ల అన్నిరకాలుగానూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికన్నా కాస్త మెరుగైనది పాలీ యురేథేన్‌(పీయూ). అయితే ఈ ప్లాస్టిక్కులు తయారయ్యేది పూర్తిగా పెట్రోలియం ఉత్పత్తులతో. పైగా వాటి తయారీ క్రమంలో క్యాన్సర్‌ కారక రసాయనాలు వెలువడటమూ, వాడిపారేశాక వందల ఏళ్లయినా మట్టిలో కలవకుండా భూమిని కలుషితం చేయడమూ వాటి పట్ల విముఖతకు కారణమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రకృతి సహజమైన పదార్థాలతో తయారయ్యే వీగన్‌ లెదర్‌ ప్రాచుర్యం పొందుతోంది. రకరకాల చెట్ల ఆకులూ పూలూ పండ్లూ కాండాలూ ఆహార వ్యర్థాలూ దేనితోనైనా లెదర్‌ తయారుచేయవచ్చని అనడమే కాదు, చేసి చూపిస్తున్నారు పరిశోధకులు. ఎన్నో దేశ విదేశీ బ్రాండ్లు ఈ లెదర్‌ తయారీలో తలమునకలుగా ఉన్నాయి. దాంతో తయారుచేసిన పలు వస్తువులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని రాబోతున్నాయి.

దీనివల్ల ఏమిటి లాభం?

లెదర్‌ కోసం జంతువులను పెంచడమూ, వాటి పట్ల క్రూరత్వమూ ఉండవు. పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండా నూటికి నూరుశాతం భూమిలో కలిసిపోతాయి. వాడే పదార్థాలన్నీ సహజమైనవే కాబట్టి వాటివల్ల ఏ దశలోనూ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఎవరు కనిపెట్టారు దీన్ని?

పైనాపిల్‌తో మొదలైంది పూర్తిస్థాయి వీగన్‌ లెదర్‌ ఆలోచన. 1990వ దశకంలో ఫిలిప్పీన్స్‌కి చెందిన డాక్టర్‌ కార్మెన్‌ హిజోసాకి వచ్చిన ఐడియా ఇది. లెదర్‌ పరిశ్రమలో అనుభవజ్ఞురాలైన ఆమె పర్యావరణంపైన ఆ పరిశ్రమ చూపుతున్న ప్రభావాన్ని చూశాక పీవీసీ కన్నా మెరుగైన ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూ ఫిలిప్పీన్స్‌ చేరింది. అక్కడ అనాసను ఎక్కువగా పండిస్తారు. పండ్ల పైనున్న పీచునీ ఆకుల్నీ చెత్తలో పడేసి తగలబెట్టేవారు. ఆ వ్యర్థాలను నిశితంగా పరిశీలించిన కార్మెన్‌ ఆకులలోనూ పీచులోనూ ఉండే పదార్థాలను తీసుకుని ప్రయోగాలు చేసి ‘పిన్యాటెక్స్‌’ని తయారుచేసింది. లెదర్‌కి ప్రత్యామ్నాయంగా దీన్ని చాలా రకాల ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ‘బాస్‌’ మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ పిన్యాటెక్స్‌తో బూట్లు కూడా తయారుచేస్తోంది. దాంతో పండ్లకోసం ఎలాగూ పెంచే అనాస నుంచే మరో కొత్త ఉత్పత్తి తయారైంది. ఆకుల నుంచి లెదర్‌ తయారీకి అవసరమయ్యే పదార్థాలను తీసుకున్నాక మిగిలిన చెత్తని ఎండబెట్టి ఎరువుగా వాడొచ్చనీ కార్మెన్‌ చెప్పడంతో ఒకప్పుడు తగలబెట్టిన వ్యర్థాలను ఇప్పుడు పూర్తిగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయత్నం ఇతర మొక్కల వైపూ పరిశోధనలను మళ్లించింది. పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో కార్క్‌ ఓక్‌ ట్రీ నుంచి లెదర్‌ తయారుచేస్తున్నారు.

కార్క్‌ ఓక్‌ అంటే..

మామూలుగా ఒక రకం ఓక్‌ చెట్టు బెరడు నుంచి సీసాలకు పెట్టే బిరడాలూ, తలుపులకు స్టాపర్లూ లాంటివాటిని తయారు చేస్తారు. బోలుగా ఉండే దీన్ని లెదర్‌గానూ మార్చేశారు. పైగా ఈ లెదర్‌ నాణ్యమైనది మాత్రమే కాదు, బరువు తక్కువ, కాస్త సాగే గుణముంది, నీటిలో తడవదు, యాంటి ఫంగల్‌ కూడా. వందల ఏళ్లు బతికే ఈ చెట్టు నుంచి తొమ్మిదేళ్లకోసారి బెరడుని తొలగించి వాడుకోవచ్చు. మామూలు లెదర్‌తో తయారుచేసే బ్యాగుల్లాంటివే కాక నీటిలో తడవదు కాబట్టి దీంతో గొడుగుల్ని కూడా తయారుచేస్తున్నారు. ఇప్పుడిక వైన్‌ పరిశ్రమ కూడా తన వంతు సాయం చేస్తోంది వీగన్‌ లెదర్‌ తయారీకి.

వైన్‌ పరిశ్రమా... ఎలా...?

ఇటాలియన్‌ కంపెనీ వెజియా రెండేళ్ల క్రితమే వైన్‌ పరిశ్రమకి ఉప ఉత్పత్తిగా వీగన్‌ లెదర్‌ని తయారుచేసింది. పదిలీటర్ల వైన్‌ తయారు చేసినప్పుడు ఆ ద్రాక్షపళ్ల తొక్కు, గింజల్లాంటివన్నీ కలిసి రెండున్నర కిలోల చెత్త మిగులుతుందట. ఏటా వేల కోట్ల లీటర్ల వైన్‌ తయారవు
తున్నప్పుడు ఎంత చెత్త మిగలాలీ. అందుకే దాన్ని లెదర్‌ తయారీకి వాడింది వెజియా. రెండున్నర కిలోల చెత్తనుంచి చదరపు మీటరు లెదర్‌ని తయారుచేయగలిగింది. మొత్తం 2600 కోట్ల లీటర్ల వైన్‌ తయారీతో వచ్చే చెత్తంతా ఇలా లెదర్‌ రూపొందించడానికి వాడితే నల్లటి ద్రాక్ష రంగులో మెరిసే వైన్‌ లెదర్‌ చౌకగా లభిస్తుంది కదా అని ఆశపడుతున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. ప్రస్తుతానికి వైన్‌ లెదర్‌ తయారీ పేటెంటు వెజియా కంపెనీకే ఉంది. ‘హెచ్‌ అండ్‌ ఎం’ లాంటి పెద్ద బ్రాండ్‌తో ఒప్పందం పెట్టుకుని పనిచేస్తోంది వెజియా. మరో పక్క బెంట్లీ కంపెనీ తన కొత్త కారు ఇంటీరియర్‌కి వైన్‌ లెదర్‌ను వాడుతున్నట్లు ప్రకటించింది. వీటన్నిటినీ తలదన్నే నాణ్యతతో వచ్చేస్తోంది పుట్టగొడుగుల లెదర్‌.

పుట్ట గొడుగుల లెదరా..?

అవును. ఒక రకం పుట్టగొడుగుల వేళ్లనుంచి ‘మ్యుస్కిన్‌’ అనే లెదర్‌ని తయారుచేస్తోంది ‘బోల్ట్‌ థ్రెడ్స్‌’ అనే సంస్థ. పుట్టగొడుగుల వేళ్లు మట్టిలో సన్నటి దారాల్లా విస్తరించి పటిష్ఠమైన నెట్‌వర్క్‌లా రూపొందుతాయి. మైసీలియం అనే ఆ వేళ్లని ఒక దశలో నియంత్రిస్తే వెలువడే పదార్థం వల్ల ఆ నెట్‌వర్క్‌ అంతా ఒక పలుచని పొరలా మారుతుంది. దాన్ని ఇతర చర్యల ద్వారా కావలసిన మందం వచ్చేలా రూపొందించి లెదర్‌ని తయారుచేస్తున్నారు. ఇప్పటివరకు తయారైన రకరకాల వీగన్‌ లెదర్లలో నాణ్యమైనది ఇదేనంటున్న పరిశోధకులు దీన్ని ‘రేపటి ప్లాస్టిక్‌ అని పిలుస్తున్నారు. ఇప్పుడు దీంతో ఇటుకలు తయారుచేయడానికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. మష్రూమ్‌ లెదర్‌ కూడా వాటర్‌ ప్రూఫ్‌. మనిషి ఒంటికి పూర్తి సురక్షితం. అందుకే దీంతో దుస్తులు, బ్యాగులు, వాచీ స్ట్రాప్స్‌, వాలెట్లు, బూట్లు తయారుచేస్తున్నారు. పుట్టగొడుగులు త్వరగా విపరీతంగా పెరుగుతాయి కాబట్టి చౌకగా తక్కువ సమయంలో లెదర్‌ తయారుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇవి మనదేశంలో దొరుకుతాయా?

మనదేశంలోనే ప్రత్యేకంగా తయారవుతున్నాయి కూడా. కేరళలో కొబ్బరి వ్యర్థాలూ నీళ్లతో లెదర్‌ తయారీకి ప్రయత్నించి విజయం సాధించారు సుస్మిత్‌ సుశీలన్‌, సుజానా గొంబొసవ. వీళ్లు ప్రారంభించిన ‘మలయ్‌.ఇకో’ సంస్థ రైతుల నుంచి కొబ్బరి నీటిని సేకరించి సూక్ష్మజీవులతో దాన్ని కల్చర్‌ చేసి కొద్ది రోజులు పులియబెడుతుంది. ఫలితంగా అది సెల్యులోజ్‌ జెల్లీలాగా తయారవుతుంది. దాన్ని శుభ్రంచేసి మరికొన్ని రకాల సహజ ఉత్పత్తులు కలిపి పలుచని షీట్‌గా తయారుచేస్తారు. అచ్చం లెదర్‌లా రూపొందిన ఈ షీట్‌తో రకరకాల ఉత్పత్తులను డిజైన్‌ చేసుకోవచ్చు. నీటిలో తడవని మలయ్‌ లెదర్‌ వాడి పారేశాక సహజంగా మట్టిలో కలిసిపోతుంది.

ఇంకా ఏయే వ్యర్థాలతో చేయొచ్చు?

దాదాపు అన్ని పండ్ల వ్యర్థాలతోనూ ఇప్పుడు లెదర్‌ తయారవుతోంది.

* వియత్నాంకి చెందిన డిజైనర్‌ ఉయెన్‌ట్రాన్‌ ‘టామ్‌టెక్స్‌’ పేరుతో ఆహారవ్యర్థాలతో తయారుచేసిన లెదర్‌ అచ్చం జంతుచర్మంలాగా మృదువుగా రకరకాల డిజైన్లు వేయ డానికి వీలుగా ఉంది. పీతలూ, రొయ్యల్లాంటి సీఫుడ్‌ వ్యర్థాలకు వాడేసిన కాఫీ పొడి లాంటివి కలిపి ట్రాన్‌ దీన్ని తయారుచేసిందట. సంప్రదాయ లెదర్‌ ఫ్యాక్టరీలకు పేరొందిన ఊళ్లో పుట్టిపెరిగిన ట్రాన్‌ ఆ ఫ్యాక్టరీలు సృష్టిస్తున్న కాలుష్యాన్ని చూసి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించింది. ప్రకృతి వనరులను రక్షించుకోవాలంటే వ్యర్థాలను తిరిగి వినియోగించక తప్పదని భావించి వీటిని ఎంచుకున్నానని చెబుతోంది ట్రాన్‌. ఆమె తన దేశం నుంచి సీఫుడ్‌ వ్యర్థాలనీ, న్యూయార్క్‌లోని హోటళ్లనుంచి కాఫీ వ్యర్థాలనూ సేకరించి ‘టామ్‌టెక్స్‌’ని తయారుచేస్తోంది. దాన్ని లెదర్‌లాగా మాత్రమే కాక రబ్బర్‌, ప్లాస్టిక్‌ లాగా కూడా తయారుచేయొచ్చనీ ప్యాకేజింగ్‌, ఫర్నిషింగ్‌ రంగాల్లోనూ వాడొచ్చనీ అంటోంది ట్రాన్‌.

* న్యూయార్క్‌లోనే ఉన్న గునాస్‌ అనే సంస్థ ‘మల్బ్‌టెక్స్‌’కి పేటెంట్‌ పొందింది. మల్బరీ ఆకుల్ని గుజ్జుగా చేసి ముందుగా పేపర్‌ తయారుచేస్తారు. దానికి నూలు వస్త్రాన్ని జత చేసి లామినేట్‌ చేసి రకరకాల జిగుర్లతో లెదర్‌ టెక్స్చర్‌ వచ్చేలా చేస్తారు. దీంతో అందమైన హ్యాండుబ్యాగులు రూపొందిస్తున్నారు.

* పర్యావరణహితమైన ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందిన హన్నా మిచౌడ్‌ ఆపిల్‌ వ్యర్థాలతో లెదర్‌ తయారుచేసింది. డెన్మార్క్‌కి చెందిన ‘యాపిల్‌ గర్ల్‌’, ఇటలీకి చెందిన ‘వీరా’ కంపెనీలు ఈ ఆపిల్‌ లెదర్‌ని తయారుచేస్తుండగా వెగ్గాని, గ్వెనెల్లె, అశోకా పారిస్‌ లాంటి అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లు దాంతో వేర్వేరు ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నాయి.

* జర్మన్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ నినా రోస్లర్‌ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమె దృష్టి టేకు ఆకులపై పడింది. వాటితో లెదర్‌ తయారుచేసి ‘నువీ నొమాడ్‌’ అనే కొత్త బ్రాండ్‌ని సృష్టించింది. ఈ లెదర్‌తో ఇప్పుడు దుస్తులూ బ్యాగులూ రూపొందిస్తున్నారు.

* లండన్‌కి చెందిన ‘లక్స్‌ట్రా’ బ్రాండ్‌ డచ్‌ సంస్థ ఫ్రూట్‌లెదర్‌ రోటర్‌డామ్‌తో కలిసి మామిడిపండు వ్యర్థాలతో హ్యాండుబ్యాగుల్ని తయారుచేస్తోంది. మిగిలిపోయిన పండ్ల గుజ్జుని బాగా మరిగించడం ద్వారా అందులోని బ్యాక్టీరియాని నిర్మూలిస్తారు. ఆ తర్వాత మరికొన్ని ప్రక్రియల సాయంతో తయారుచేసిన మృదువైన లెదర్‌ని దుస్తులూ బ్యాగులూ తయారుచేయడానికి వాడుతున్నారు.

* మెక్సికోకి చెందిన ఆడ్రియన్‌ లోపెజ్‌, మార్టె కెజారెజ్‌లు బొమ్మజెముడు మొక్కనుంచి ‘డిజర్టో లెదర్‌’ని తయారుచేశారు. దాన్ని ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌కి మాత్రమే కాదు, ఇంటీరియర్స్‌కి కూడా వాడొచ్చట.

* కోస్రా అనే చిన్న ద్వీపంలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఏర్పడ్డ ‘గ్రీన్‌ బనానా పేపర్‌’ అనే సామాజిక వ్యాపారసంస్థ వృథాగా పడేసే అరటి కాండం నుంచి తీసిన పీచుతో లెదర్‌ తయారుచేయిస్తోంది.

* ఫ్రెంచ్‌ పాదరక్షల బ్రాండ్‌ ‘వెజా’ మొక్క జొన్న లెదర్‌తో బూట్లు తయారుచేసింది.
ఇవే కాదు, ఇంకా ప్రయోగాల దశలోనూ కొన్ని ఉన్నాయి.

ఎలాంటివి..?

బీర్‌ తయారుచేయడానికి వాడే ఈస్ట్‌తో ‘జోయా’ లెదర్‌ని తయారుచేస్తోంది మోడర్న్‌ మెడో అనే కంపెనీ.

అలబామాలోని ఆబర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్‌ టీ లెదర్‌ తయారుచేసి దాంతో బూట్లను డిజైన్‌ చేశారు. అయోవా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పులియబెట్టిన ఒక రకం టీ(కొంబుచ) నుంచి ‘టెదర్‌’(టీ లెదర్‌) తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ‘లె కారా’ తమ దేశంలో పండే పూలూ పండ్ల నుంచి మైక్రోఆర్గానిజమ్స్‌ని సేకరించి వాటితో ల్యాబ్‌ లెదర్‌ని తయారుచేశాడు.

ఇండొనేషియాకి చెందిన కొందరు మహిళలు తోఫూ తయారీ తర్వాత మిగిలే వ్యర్థాలతో సోయా లెదర్‌ని తయారుచేశారు.

హ్యాండ్‌బ్యాగులూ వాలెట్లూ ల్యాప్‌టాప్‌ లగేజీ బ్యాగులూ బెల్టులూ బూట్లూ ఇంట్లో ఫర్నిచరూ కార్లో సీట్లూ... ఇలా మన జీవితంలో అడుగడుగునా లెదర్‌ వస్తువుల్ని వాడతాం. స్తోమత ఉన్నవారు జంతుచర్మాలతో చేసిన లెదర్‌ను వాడితే సామాన్యులు సింథటిక్‌ లెదర్‌తో తృప్తి పడుతున్నారు.
ఏది వాడుతున్నా మనసులో ఓ మూల తప్పు చేస్తున్నామన్న భావన ఆలోచనాపరులను వేధిస్తూనే ఉంటుంది. అదే- వ్యర్థాలతో తయారయ్యే ఈ వీగన్‌ లెదర్‌గానీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తే అప్పుడిక అందరూ నిశ్చింతగా లెదర్‌ వస్తువుల్ని వాడేసుకోవచ్చు!

మన కంపెనీలూ ఉన్నాయి!

పెటా సంస్థ ద్వారా వీగన్‌ లెదర్‌ సర్టిఫికెట్‌ పొందిన పలు సంస్థలు మనదేశంలోనూ ఉన్నాయి. అయితే వాటిలో బ్రోక్‌మేట్‌, ది ఆల్టర్నేట్‌, సెన్సో, మూన్‌ రాబిట్‌, హామెలిన్‌, హ్యాపీ సోల్‌, అకిలెస్‌ హీల్స్‌ లాంటివన్నీ సింథటిక్‌ లెదర్‌ని వాడి ఫ్యాషన్‌ యాక్సెసరీలను తయారుచేస్తుండగా కొన్ని కంపెనీలు మాత్రమే పూర్తిగా మొక్కల నుంచి తయారుచేసిన లెదర్‌ని వాడుతున్నాయి. ఎ బిగ్‌ ఇండియన్‌ స్టోరీ, ఆలివ్‌ లాంటి సంస్థలు పైనాపిల్‌, క్యాక్టస్‌ లెదర్‌ను వాడుతున్నాయి. ముంబయికి చెందిన పయావో- వస్త్రానికి ప్లాంట్‌ బేస్‌డ్‌ లెదర్‌ను జతచేసి మహిళల కోసం పాదరక్షల్ని రూపొందిస్తోంది. చెన్నైకి చెందిన ‘ఆర్చర్‌’ కార్క్‌ లెదర్‌నీ, ‘కానబిస్‌’ జనపనారనీ, కేరళకు చెందిన ‘మలయ్‌’ కొబ్బరి నీటినుంచి తయారుచేసిన లెదర్‌నీ, ముంబయికి చెందిన ‘జౌక్‌’ పువ్వులతో తయారుచేసిన లెదర్‌నీ వాడి బ్యాగులూ వాలెట్లూ బూట్లూ బెల్టులూ తయారుచేస్తున్నాయి.

ఇది పువ్వుల లెదర్‌!

యూపీలోని కాన్పూర్‌ నగరం మామూలు లెదర్‌ పరిశ్రమకు పేరొందింది. అలాంటి చోట పువ్వులతో ప్రత్యామ్నాయ లెదర్‌ తయారుచేసి చరిత్ర సృష్టించింది ‘ఫూల్‌.కో’ అనే సంస్థ. అంకిత్‌ అగర్వాల్‌, సౌమ్యాశ్రీవాస్తవ కలిసి పువ్వుల్ని రీసైక్లింగ్‌ చేసే చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. గుడుల్లో ఉపయోగించిన పువ్వులను సేకరించి వాటితో అగర్‌బత్తీలు తయారుచేసేవారు. ఓసారి అలా కుప్పగా పడివున్న పువ్వుల మధ్య బూజులా కన్పించిన దారంపోగుల లాంటి నిర్మాణం పరిశోధకురాలైన సౌమ్యను ఆకట్టుకుంది. అది లెదర్‌ నిర్మాణాన్ని పోలివుండటంతో ఐఐటీ కాన్పూర్‌ సహాయంతో మరింత లోతుగా పరిశోధించి ‘ఫ్లెదర్‌’ అనే కొత్త లెదర్‌ను తయారుచేసింది. లెదర్‌లో కొలాజెన్‌ ఉన్నట్లే పువ్వుల లెదర్‌లో ‘చిటిన్‌’ అనే ఒకరకం పాలిమర్‌ ఉంటుందనీ దానివల్లే పువ్వుల లెదర్‌కి మామూలు లెదర్‌ లక్షణాలు వస్తున్నాయనీ అంటుంది సౌమ్య. వీళ్ల సంస్థ రోజూ దాదాపు మూడు టన్నుల పూలను సేకరించి, వాటితో లెదర్‌ తయారుచేసి విక్రయిస్తోంది. మామూలు లెదర్‌తో తయారుచేసే వస్తువులన్నిటినీ ఈ లెదర్‌తోనూ తయారుచేయవచ్చు. ఐక్యరాజ్యసమితి వారి సస్టెయినబిలిటీ అవార్డు పొందిన ‘ఫ్లెదర్‌’ని ఇప్పుడు అనితా డోంగ్రె లాంటి పెద్ద పెద్ద ఫ్యాషన్‌ డిజైనర్లు ఉపయోగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.