ETV Bharat / lifestyle

ఈ 'ఉగాది ఫేస్ ప్యాక్స్'తో మెరిసిపోండిలా..! - ఫేస్ ప్యాక్స్​

పచ్చపచ్చటి తోరణాలతో, రంగురంగుల పూలతో.. ముంగిళ్లన్నీ అలంకరించుకుని ముగ్ధమనోహరంగా ముస్తాబయ్యే తరుణమే 'ఉగాది'. మరి ఈ రోజున కొందరు కొత్త పనులకు శ్రీకారం చుడితే, మరికొందరు రాశిఫలాలు చూసుకోవడంలో బిజీ అయిపోతారు. అంతేనా..! ఉగాది పండగ స్పెషల్ 'ఉగాది పచ్చడి' రుచిని ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తామా..? అని ఉబలాటపడుతుంటారు. మరి దీనికి అంతటి రుచిని అందించిన షడ్రుచులు.. కేవలం దాని రుచిని ద్విగుణీకృతం చేయడమే కాదు.. మన అందాన్నీ మరింతగా పెంచుతాయి.. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే అదెలాగో తెలియాలంటే ఇదోసారి చదవాల్సిందే!

ugadi-special-face-packs-with-natural-remedies
ఈ 'ఉగాది ఫేస్ ప్యాక్స్'తో మెరిసిపోండిలా..!
author img

By

Published : Apr 13, 2021, 1:00 PM IST

వేపతో..

వేప అనగానే 'ఛీ.. చేదు..' అనేస్తాం మనమంతా.. కానీ అది చేసే మేలు అంతా ఇంతా కాదు.. కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా వేప చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో ఉపయోగించే వేప పువ్వులు చర్మ సంబంధిత సమస్యలన్నీ తొలగించి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఇందుకోసం వేప పువ్వుల్ని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలున్న చోట అప్లై చేస్తే సరిపోతుంది. ఇక వేపాకులు.. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తాయి. ఇంతకీ ఈ ఆకుల్ని ఎలా వాడాలంటారా? అక్కడికే వస్తున్నాం..!

kothajkasdjkasdd6507.jpg
వేపపూలతో

దాదాపు 50 వేపాకులను తీసుకుని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆకులు రంగు మారి నీళ్లంతా ఆకుపచ్చగా అయ్యేంత వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ స్నానం చేసే నీటిలో దాదాపు 100 మి.లీ. చొప్పున ఈ మిశ్రమాన్ని కలిపి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. ఈ నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.

అంతేకాక వేపాకులను మెత్తగా చేసి ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. అదెలాగంటే ఓ పది వేపాకులను తీసుకుని, అందులో కాస్త నారింజ తొక్కల పొడిని కలిపి కొద్దిపాటి నీటితో మెత్తని గుజ్జులా మారే వరకు మరిగించాలి. తర్వాత దాంట్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయాపాలు వంటివి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికి మూడు సార్లు వేసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను కూడా పొందచ్చు.

kothajkasdjkasdd650.jpg
వేప ప్యాక్

కండిషనర్‌లా కూడా..

కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. ఇందులో కొద్దిగా తేనెను కలిపి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును జుట్టుకు పట్టించి, అరగంట ఆరనిచ్చి తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. అలాగే చుండ్రును కూడా తొలగిస్తుంది.

మామిడితో..

kothajkasdjkasdd6506.jpg
ఆహా మామిడి..

మామిడి లేని ఉగాది అసంపూర్ణమనే చెప్పాలి. దీనితో కూడా మన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. మామిడిలో ఉండే గుణాలు నల్లమచ్చలు, మొటిమలు..వంటి సమస్యల్ని పోగొట్టి ముఖంలో కొత్తదనాన్ని నింపుతాయి. మామిడిని స్క్రబ్బింగ్, ట్యానింగ్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్.. ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బాదం, ఓట్ మీల్.. లాంటి వాటితోనూ మామిడి గుజ్జుని కలిపి ముఖాన్ని అందంగా మెరిపించొచ్చు.
పచ్చి మామిడి రసంలో..
ఎప్పుడైనా పొరబాటున దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు పచ్చి మామిడి బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా చిన్న పచ్చి మామిడి కాయలను వేడి నీటిలో వేసి బాగా మరగనిచ్చి ఈ రసాన్ని దెబ్బ తగిలిన ప్రాంతంలో రాయడమే..! ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. అంతేకాక అప్పుడప్పుడు ముఖాన్ని ఈ నీటితో శుభ్రపరుచుకుంటే ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు.. లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు.

mangooo6504.jpg
మామిడి గుజ్జుతో..

ట్యానింగ్..

మండే వేసవిలో చర్మంపై ట్యాన్ ఏర్పడటం సహజమే..! ఆ ట్యాన్‌ను మామిడితో వదిలించొచ్చు.. ఇందుకోసం మనకు కావాల్సిందల్లా ఒక చెంచా గోధుమ పిండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి వదిలేయండి. అలా ఒక అరగంట ఆరనిచ్చి తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే సరి..! ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు బాగా తెరుచుకుని, ఆ రంధ్రాల్లో ఉన్న మట్టి పూర్తిగా తొలగిపోతుంది. ఫలితంగా ట్యాన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
చర్మఛాయను మెరుగుపరచాలంటే...
చర్మ రంగు కాస్త తక్కువగా ఉన్నవారు మంచి ఛాయలోకిి రావడానికి మామిడిని ప్రయత్నించవచ్చు. దీని కోసం మనకు కావాల్సిందల్లా కాస్త ఓపిక, అంతే..! నీరు, పాలలో నానబెట్టిన బాదం పేస్ట్, ఓట్‌మీల్, మామిడి గుజ్జు కలిపి తయారుచేసే ఈ ఫేస్‌ప్యాక్స్ అన్ని రకాల చర్మతత్వాలకు ఉపయోగపడుతుంది. ఒక చెంచా మామిడి గుజ్జులో కొద్దిగా బాదం పేస్ట్ వేసి రెండు లేక మూడు చెంచాల పాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట తరువాత శుభ్రపరుచుకుంటే సరి..! ఇక ఓట్‌మీల్ ఫేస్ ప్యాక్‌ను సున్నిత చర్మం గలవారు ప్రయత్నించచ్చు. మీరు చేయాల్సిందల్లా మామిడి పండు గుజ్జులో కాస్త ఓట్‌మీల్, పాలు, తేనె కూడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, ఒక ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి..!

kothajkasdjkasdd6501.jpg
ప్యాక్​ వేసుకోండి..

స్క్రబ్బర్‌లా..

కొన్ని చోట్ల మామిడి తొక్కను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ముఖానికి స్క్రబ్బింగ్ చేసుకోవటానికి ఉపయోగిస్తారు. స్క్రబ్బింగ్ పద్ధతి కూడా తేలికేనండోయ్..! ఇందుకు మనకు కావాల్సిందల్లా మామిడి తొక్కను పొడి చేసుకుని అందులో కాస్త పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా ఒక అరగంట ఆరనిచ్చి ఆ తరువాత కడిగేసుకుంటే సరి..! ఈ పద్ధతి కేవలం స్క్రబ్బర్‌లానే కాక పలు రకాల చర్మ, ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

చింతపండుతోనూ అందంగా..

kothajkasdjkasdd6505.jpg
చింతపండు..

ఉగాది పచ్చడిలో కీలక పాత్ర పోషించే మరో రుచి పులుపు. ఎప్పుడూ పండ్లు, కూరగాయలు.. ఇలా వీటితోనే ఫేస్‌ప్యాక్‌లు చేసుకుంటే ఏం బావుంటుంది చెప్పండి.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఎందుకు ట్రై చేయకూడదు..? అందుకే చింతపండు ఫేస్‌ప్యాక్‌తో ఈ ఉగాదికి అందంగా మెరిసిపోండి. అదెలాగంటే:

kothajkasdjkasdd6502.jpg
సహజంగా..

చందనం కలిపి..

చింతపండుకి కాస్త చందనం పొడి జోడిస్తే మంచి ఫలితాన్ని పొందచ్చు. అదెలాగంటే రెండు టేబుల్ స్పూన్ల తాజా చింతపండు గుజ్జులో అరస్పూన్ చందనం పొడి, అరస్పూన్ ముల్తానీ మట్టి, కొద్దిగా పెరుగు, కొన్ని రోజ్‌వాటర్ చుక్కలు.. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసి ఇరవై లేదా ఇరవై అయిదు నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరి..! ఇది కేవలం ముఖాన్ని తాజాగా ఉంచడమే కాక ఏవైనా చర్మ సమస్యలున్నా త్వరగా తగ్గిస్తుంది.
పసుపుతో..
30 గ్రాముల చింతపండును 100 గ్రాముల నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత మొత్తం వడకట్టి గుజ్జును మాత్రం తీసుకుని అందులో ఒక అరస్పూన్ పసుపు, కొద్ది మొత్తాల్లో బార్లీపొడి, రోజ్‌వాటర్, కీరదోస రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి పూర్తిగా ఆరిపోయేంత వరకు వదిలేయాలి. తరువాత కాస్త గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుని మెత్తటి వస్త్రంతో తుడుచుకుంటే సరి..! ఆఖర్లో కాస్త మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు.

ఇదీ చూడండి: చేదు తర్వాతే తీపి.. కరోనా తర్వాతే సంతోషం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.