ETV Bharat / lifestyle

ఉదయకాంతిలో వినీలాకాశం.. సాయం సంధ్యలో మబ్బువర్ణం! - ఈటీవీ భారత్​ వార్తలు

ఉదయకాంతిలో వినీలాకాశంలో విరిసిన ‘పసుపు’ వన్నెలూ... సాయం సంధ్యలో ‘బూడిద’రంగు పులుముకున్న మబ్బు తెరలూ... ఏ రంగు అందం దానిదే. ఒకటి ఉత్సాహంతో ఉరకలెత్తిస్తే, మరొకటి నిద్రాదేవిని స్వాగతిస్తూ సేదతీరుస్తుంది. అందుకే ఈ ఏటి ఫ్యాషన్‌ వర్ణాలుగా ఆ రెండు రంగుల్నీ ఎంపిక చేసి, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతోంది పాంటోన్‌ కలర్‌ ఇన్‌స్టిట్యూట్‌.

నూతన సంవత్సరానికి రెండు రంగులతో స్వాగతం
నూతన సంవత్సరానికి రెండు రంగులతో స్వాగతం
author img

By

Published : Jan 3, 2021, 4:41 PM IST

ఆన్‌లైన్‌ కావచ్చు, మాల్‌ కావచ్చు... డ్రెస్సు లేదా వస్తువు కొనాలంటే ముందు చూసేది కళ్లకి నచ్చిన రంగునే. ఆ తరవాతే నాణ్యత. అందుకే ఏటా మార్కెట్లోకి రాబోయే దుస్తుల ఫ్యాషన్లూ యాక్సెసరీలూ గృహాలంకరణ వస్తువుల డిజైన్లను దృష్టిలో పెట్టుకుని ఓ రంగుని ఎంపిక చేస్తుంటుంది పాంటోన్‌, అంతర్జాతీయ రంగుల సంస్థ. అయితే ఈసారి ఒక రంగుని కాకుండా రెండు రంగుల్ని ఎంపికచేసింది. కరోనాతో కమ్ముకున్న భయాందోళనలన్నీ తొలగి ఆనందం వెల్లివిరియాలన్న తలంపుతో ఎంపిక చేసిన ప్రకాశవంతమైన పసుపు రంగుకి; ఆ సంతోషం హద్దులు దాటకుండా దాన్ని స్థిరంగా ఉంచుతూ హాయిని పంచే బూడిద(గ్రే) వర్ణాన్ని మేళవించారు కలర్‌ థెరపిస్టులు.

పైగా నిండైన పసుపు రంగు అమ్మాయిల హాట్‌ ఫేవరెట్‌. అలాగే లేత రంగులో సోబర్‌గా కనిపించే గ్రే షేడ్స్‌ అబ్బాయిల ఛాయిస్‌. కాబట్టి ఇద్దరూ మెచ్చే రంగుల్ని ఎంపిక చేసినందుకు తమను తామే అభినందించుకుంటున్నారు పాంటోన్‌ నిపుణులు. నిజానికి పసుపు వర్ణానికి నలుపు మంచి కాంబినేషన్‌ అనేది ఫ్యాషనిస్టుల ఉవాచ. కానీ దానికి లేత నలుపుని తలపించే గ్రే కలర్‌ మరింత బాగా సూటవుతుందని ఇప్పుడే తెలిసింది అని సంప్రదాయ ఫ్యాషనిస్టులూ వంత పాడుతున్నారు. అనడమే కాదు, అప్పుడే ఆ రెండు రంగుల సమ్మేళనంతో దుస్తుల డిజైనింగ్‌కీ శ్రీకారం చుట్టేశారు. ఒకటి ఉరకలెత్తే ఉత్సాహానికీ మరొకటి నిశ్శబ్దానికీ సంకేతంగా నిలుస్తాయంటూ భాష్యం కూడా చెప్పేస్తున్నారు.

ఆనంద వర్ణం!

పచ్చదనం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హేమంత రుతువే. శీతకాలపు చీకటి తెరలను చీల్చుకుంటూ నులివెచ్చని కాంతుల్ని పంచే హేమంతంలో ఆకులన్నీ పసుపురంగులోకి మారడంతో ప్రకృతికాంత పసుపు వన్నెల్ని సింగారించుకుంటుంది. ఇక, ఈ కాలంలో విరిసే బంతులూ చామంతులూ తంగేడు పూలూ; ఆవ, జనప చేలూ పసుపుపచ్చ కోక సింగారించుకున్నట్లుగా చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటాయి. శిశిరం రాగానే తెరమరుగైపోయే ఆ పసుపుదనం ఏడాది పొడవునా మనతోనే ఉండేందుకన్నట్లు డిజైనర్లు దుస్తులకి పసుపురంగుని చొప్పించేస్తుంటారు. అదీగాక వెచ్చదనాన్నీ కాంతినీ ఆనందాన్నీ ఊహాశక్తినీ ఆధ్యాత్మికతనీ ఆశావహ దృక్పథాన్నీ ప్రతిబింబించే రంగే పసుపు. సంతోషానికి ప్రతీకగా భావించే పసుపు రంగుని ఒకప్పుడు రాజులు మాత్రమే ధరించేవారట.

ఉల్లాసాన్ని పంచే ఈ రంగుని ఆనంద వర్ణంగా చెబుతారు. ఈ కాంతి మెదడుని ప్రభావితం చేసి ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. అందుకే డిప్రెషన్‌ బాధితుల్ని ఈ రంగు పెయింట్‌ వేసిన గదిలో ఉంచినా కిటికీలను పసుపు కర్టెన్లతో అలంకరించినా హుషారు వస్తుందంటారు కలర్‌ థెరపిస్టులు. పచ్చదనం తెచ్చిన ఆనందంతో ముఖం ప్రకాశవంతంగా మారుతుందనీ, పెద్ద వయసువాళ్లు ఈ రంగు ఛాయల్లో కాస్త వయసు తక్కువగా కనిపిస్తారనీ కూడా అంటారు. పైగా పసుపుకి గులాబీ ఎరుపూ నలుపూ నీలం ఇలా ఏ రంగైనా చక్కగా సెట్టయిపోతుంది. కానీ నిమ్మరంగు పసుపుకి నారింజ జత కలిస్తే ఆ అందమే వేరు. ఇక, ఆకుపచ్చకి పసుపు జోడిస్తే కళ్లకీ ఒంటికీ ఎంతో హాయి. అయితే ఇప్పుడు పసుపుతో బూడిదవర్ణాన్ని జోడించడం తాజా ట్రెండ్‌ అన్నది మర్చిపోకండి.

కాంబినేషన్ల సంగతెలాగున్నా పసుపు శుభ సంకేతం. అందుకే మనదగ్గర శుభకార్యాల్లో కోరి మరీ పసుపు రంగు దుస్తుల్నే ధరిస్తారు. పసుపురంగు సఫైర్‌, టోపాజ్‌ రాళ్లతో చేసిన నగలూ అందంగా మెరుస్తుంటాయి. ఈ రంగు జీవక్రియని పెంచడం ద్వారా ఆకలినీ పెంచుతుంది అంటారు పోషక నిపుణులు. ఆహార పదార్థాల్లో ఈ రంగును ఎక్కువగా వాడటానికి కారణమిదే.

మిశ్రమ వర్ణం!

కొత్తగా ఎన్ని రంగులు పుట్టుకొచ్చినా ఫ్యాషన్‌వేదిక మీద నిరంతరం తన ఉనికిని చాటుకునే రంగేదయినా ఉందీ అంటే అది నలుపే. అందులోని లేత రంగే గ్రే. అయితే ఇందులో సిల్వర్‌, బూడిద, కూల్‌, చార్కోల్‌, లెడ్‌, గన్‌మెటల్‌, నికెల్‌, ప్లాటినం గ్రే, ఐవరీ బ్లాక్‌, లెడ్‌ వైట్‌... ఇలా ఛాయలు చాలానే ఉన్నాయి. ఎలాంటి భావోద్వేగాల్నీ ప్రతిఫలించని ఈ రంగుని చాలామంది బోరింగుగా ఫీలవుతారు, ఒంటరితనానికి సంకేతంగానూ భావిస్తారు. కానీ ఇది స్థిరత్వాన్నీ తెలివితేటల్నీ ప్రతిబింబిస్తూ హుందాగా ఉంటుందని కొందరు ధరిస్తుంటారు. ప్రకాశవంతమైన రంగులతో జోడించడంవల్ల రెండూ సరికొత్త అందంతో మెరుస్తుంటాయి.

పైగా ఈమధ్య నగలూ దుస్తుల్లో సిల్వర్‌ గ్రే ఫ్యాషన్‌గా మారింది. నిజానికి 18వ శతాబ్దంలో అమ్మాయిల డ్రెస్సులూ అబ్బాయిల సూటూబూట్లలో గ్రే కలరే ఎక్కువగా కనిపించేది. క్రమంగా ఇది ఫ్యాషన్‌ ప్రపంచంలో మాయమై, మిలటరీ వర్ణంగా స్థిరపడింది. పరిసరాల్లో కలిసిపోయినట్లుగా ఉండి దూరానికి అంతగా కనిపించదన్న కారణంతో నాజీలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ రంగునే ధరించారట. ఇన్నేళ్ల తరవాత మరోసారి మళ్లీ గ్రే ఛాయల్ని ర్యాంప్‌ మీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కలరిస్టులు. దాంతో సిల్వర్‌ గ్రేకి నీలం, గులాబీ, ఎరుపు, పసుపు రంగు షేడ్స్‌ని జోడించడం ద్వారా సరికొత్త వర్ణ మిశ్రమానికి శ్రీకారం చుట్టేశారు డిజైనర్లు. పసుపు రంగు ఫర్నిచర్‌కీ గృహాలంకరణ వస్తువులకీ కూడా గ్రే బ్యాక్‌గ్రౌండ్‌ చక్కగా నప్పుతుంది. సో, గతేడాది మిగిల్చిన విషాదఛాయల్ని తొలగిస్తూ ఈ రెండు రంగులూ రాబోయే ఏడాదిలో మనుషుల్లో ఆశావాదాన్ని నింపుతూ సుస్థిరమైన ఆలోచనలతో ఆనందోత్సవాల్ని నింపుతాయని ఆశిద్దాం..!

ఇదీ చదవండి: 'కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతులకు అన్యాయం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.