ఆరోగ్యం కోసం వారానికొకసారైనా ఆహారాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. అలాగే ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్కిన్ ఫాస్ట్ చేయాలని సూచిస్తున్నారు. దీనిద్వారా చర్మతత్వాన్ని కూడా తెలుసుకోవచ్చని, దానిబట్టి చర్మాన్ని సంరక్షించుకునే అవకాశం ఉందంటున్నారు.
ఫాస్టింగ్..
ప్రతిరోజు ముఖానికి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్‌లోషన్స్, రకరకాల క్రీంలు రాయడంతో చర్మరంధ్రాలకు ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దీన్ని నివారించాలంటే వారంలో ఒక రోజును స్కిన్ ఫాస్టింగ్‌ను ఎంచుకోవాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి మృదువైన వస్త్రంతో అద్దాలి. ఆ తర్వాత ఏ క్రీంలనూ రాయొద్దు. ఇలా రోజంతా ఉండాలి. దీంతో చర్మంలో శ్వాసక్రియ బాగా జరిగి, అక్కడ ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మరోసారి ముఖాన్ని రసాయనాల్లేని సబ్బు లేదా ఫేస్‌వాష్‌తో కడగాలి. ఫేస్‌క్రీం, మాయిశ్చరైజర్ వంటివేవీ అప్లై చేయకుండా నిద్రకు ఉపక్రమించాలి. ఇలా స్కిన్‌ఫాస్టింగ్ చేసే రోజున ప్రత్యేకంగా ఎక్కువ నీటిని, ద్రవపదార్థాలను తీసుకుంటే, చర్మకణాల్లోని మురికి బయటకు వచ్చి, తాజాగా అవుతుంది.
టిష్యూపేపర్ టెస్ట్..
ఒక రోజంతా స్కిన్ ఫాస్టింగ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం చర్మ తత్వాన్ని గుర్తించొచ్చు. అదెలాగంటే, ముఖంపై టిష్యూపేపర్‌ను అద్ది చూడాలి. టిష్యూ పొడిగానే ఉంటే, పొడిచర్మంగా, అలాగే ముఖంపై అంటుకుని ఆ తర్వాత విడిగా ఆ పేపర్ కింద పడిపోతే నార్మల్ స్కిన్ అని అర్థం చేసుకోవాలి. ముఖంపై టిష్యూపేపర్ అంటుకుని అలాగే ఉండిపోతే ఆయిలీస్కిన్. దీనికి తగినట్లుగా పొడిచర్మ తత్త్వం ఉన్నవారు మేకప్‌కు ముందు నిత్యం మాయిశ్చరైజింగ్ అప్లై చేయడం మంచిది. అప్పుడే చర్మం తేమను కోల్పోదు. ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాత్రం ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం, అలాగే ప్రతిసారీ గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. చర్మానికి తగిన క్రీమ్స్‌ను ఎంచుకోవాలి. నార్మల్ స్కిన్‌కు ఏ సమస్యా ఉండదు. వారానికోసారి ఇలా మేకప్‌కు దూరంగా ఉంటే అక్కడి కణాల్లో మురికి చేరడం తగ్గుతుంది. దీంతో మొటిమలు, మచ్చలు వంటివీ రాకుండా ఉంటాయి.
ఇవీ చూడండి:
Fair Skin Tips: చర్మం మెరిసిపోవాలంటే...