ETV Bharat / lifestyle

Beauty tips: ఈ వానాకాలంలో పాదరక్షలు ఎంచుకోండిలా..!!

వానాకాలంలో కాలిని పూర్తిగా కప్పేసే బూట్లు, చెప్పులకు దూరంగా ఉండాలి. వీటితో వానలో తడిస్తే ఇబ్బందే. నీటిని పీల్చుకుని బరువుగా మారతాయి. త్వరగా ఆరవు. దాంతో వాటిలో సూక్ష్మ జీవులు ఆవాసం ఏర్పరుచుకుంటాయిక్కడ. ఈ కాలంలో చెప్పుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు రక్షణతోపాటు అందంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. స్టైలిష్‌గా ఉండటమూ తప్పనిసరి. మరి అలాంటి వాటిని ఎలా ఎంచుకోవాలి?

Beauty tips: ఈ వానాకాలంలో పాదరక్షలు ఎంచుకోండిలా..!!
Beauty tips: ఈ వానాకాలంలో పాదరక్షలు ఎంచుకోండిలా..!!
author img

By

Published : Jun 24, 2021, 10:03 AM IST

  • ఫ్లిప్‌ఫ్లాప్స్‌... ఈ కాలంలో ఫ్లిప్‌ఫ్లాప్స్‌ చక్కటి ఎంపిక. వీటిపై నీళ్లు నిలిచి ఉండవు. త్వరగా ఆరిపోతాయి.
  • శాండిల్స్‌: తడిచినా త్వరగా ఆరిపోతాయి. ఇబ్బంది పెట్టవు. స్ట్రాప్స్‌ను పెట్టి, తీయడం కూడా సులువే.
  • క్లాగ్స్‌... వీటికి ఉండే రంధ్రాల వల్ల ఇవి ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. తేలికగానూ, వాటర్‌ ప్రూఫ్‌గానూ ఉంటాయి. సౌకర్యంతోపాటు స్టైలిష్‌గానూ కనిపిస్తాయి.
  • ఈ కాలంలో తడిచిన చెప్పులు, బూట్లు ఆరడానికి సమయం పడుతుంది. అప్పుడు వాటి నుంచి దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. అలా కాకుండా వోడర్‌ రెసిస్టెంట్‌ రకాలను ఎంచుకుంటే మేలు.
  • వాటర్‌ ప్రూఫ్‌ రకాలు.. తేలికగా ఉండే మన్నికైన వాటర్‌ప్రూఫ్‌ పాద రక్షలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిని సులువుగా శుభ్రం చేసి ఆరబెట్టొచ్చు కూడా.
  • రబ్బరు సోల్‌ ఉండే బూట్ల రకాలను ఎంచుకుంటే సరి. ఇవి వాటర్‌ప్రూఫ్‌గానూ ఉండి నీటిని నిలవనీయవు.

ఇదీ చదవండి: Kachili Fish: ఈ చేప ధర రూ.2.60లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.