ETV Bharat / lifestyle

'నాకు కళ్లు లేవు.. కానీ అమ్మ ప్రపంచాన్నే చూపించేసింది' - శ్రావ్య కణితి సక్సెస్​ కథనం

'అమ్మా.. టీచర్స్‌ తిడుతున్నారు. పిల్లలు నాతో ఆడటం లేదు' స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అమ్మతో చెప్పి ఏడ్చేదా అమ్మాయి... అమ్మ ఆ పాపని ఎప్పట్లానే ఓదార్చాలనుకోలేదు. గట్టి జీవితపాఠం నేర్పాలనుకుంది. 'ప్రపంచం ఇలానే ఉంటుంది పాపా. ఏడవడం కాదు.. ఎదుర్కో' అందా తల్లి. అంధురాలైన ఆ అమ్మాయి అమ్మ మాటల్ని బలంగా నమ్మింది.. వైఫల్యాలనే నిచ్చెనగా చేసుకుని గాయనిగా ఎదిగింది. ఐఎస్‌బీలో ఎంబీయే చదివి... ఉన్నతోద్యోగం సాధించింది. ఆమే శ్రావ్య కణితి.. ఆమె చెప్పిన గెలుపు కథ ఇది...

shravya kanithi latest news
'నేను చూడలేకున్నా.. అమ్మ చెప్పిన పాఠం ప్రపంచాన్ని చూపించింది!'
author img

By

Published : Oct 7, 2020, 8:27 AM IST

Updated : Oct 7, 2020, 8:35 AM IST

నేను పుట్టినప్పుడు అందరిలానే అమ్మానాన్నలు చాలా మురిసిపోయారు. పెద్దయ్యాక... అది చదివించాలి, ఇలా చేయాలని కలలు కన్నారు. నేను పుట్టిన 13రోజులకనుకుంటా.. ఎందుకో అనుమానం వచ్చి డాక్టర్లకి చూపిస్తే నాకు చూపు లేదని తెలిసింది. వైద్యంతో పరిష్కారం అవుతుందేమోనని అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈలోపు తెలిసినవాళ్లు... అమ్మానాన్నలకు చాలా సలహాలు ఇచ్చారు. మీవల్ల కాదు.. ఏదైనా స్పెషల్‌ స్కూల్లో చేర్చండన్నారు. అవేమి పట్టించుకోకుండా మామూలు స్కూల్లో చేర్చడానికి సిద్ధమయ్యింది అమ్మ. ఎవరూ చేర్చుకోమన్నారు. మరికొందరు... మిగతా పిల్లల తల్లిదండ్రులు ఏమంటారో అని నసిగారు.

ఆ క్రమంలో అమ్మానాన్నలకి చాలా విషయాలు తెలిశాయి. ఆలోపు నాకు ఎవరో ఒక పియానో కానుకగా ఇచ్చారు. దాంతో తెగ ఆడేదాన్నట. పాటల్ని ఇష్టంగా విని.. పాడేదాన్నట. ఇది గమనించిన అమ్మావాళ్లు.. సంగీతం నేర్పిస్తే బాగుంటుందనుకున్నారు. కానీ అది నేర్పడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో మా గురువు పద్మినిగారు మాత్రం... మరో ప్రశ్న వేయకుండా జాయిన్‌ చేసి వెళ్లమన్నారు. అలా మామూలు స్కూల్‌కంటే ముందు సంగీత పాఠాలు నేర్చుకున్నా. ఆవిడే... పాపకి వైజాగ్‌ కంటే హైదరాబాద్‌ అయితే బాగుంటుందనడంతో అమ్మానాన్న మరో ఆలోచన లేకుండా హైదరాబాద్‌ వచ్చేశారు. ఆ సమయంలో వాళ్ల కెరీర్‌... ఇవేమి ఆలోచించుకోలేదు. వాళ్ల ఆలోచనంతా నేనే అయ్యాను.

successful story of blind woman shravya kanathi
తన తల్లితో

అప్పుడు కాళ్లూ, చేతులూ చల్లబడేవి...

ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్లో సీటు దొరికింది. పిల్లలంతా ఆడుకునేవారు కానీ.. నన్ను మాత్రం వాళ్లతో చేర్చుకునేవారు కాదు. అలా నేను ఒంటరిదాన్నయ్యాను. ఇక క్లాసులో... టీచర్లు వర్క్‌ ఇచ్చి చదవమని చెప్పి వాళ్లు బయటకు వెళ్లేవారు. నాకు చదవడం వీలుకాదుగా... పక్కనున్న పిల్లలని అడిగేదాన్ని. వాళ్లేమో ‘మాకే టైం సరిపోదు. నీకేం చెబుతాం’ అనేవారు. ఈలోపు టీచర్లు వచ్చి నేనేదో క్లాసుని డిస్టర్బ్‌ చేస్తున్నా అనుకుని తిట్టేవారు. టీచర్లు నన్నెందుకు తిడుతున్నారో అర్థంకాక అమ్మతో చెప్పి ఏడ్చేదాన్ని.

ఒక రోజు మా అమ్మ నాతో చాలా స్పష్టంగా చెప్పింది. రేపొద్దున్న నువ్వు అడుగుపెట్టే ప్రపంచం ఇలానే ఉంటుంది. వాటిని ఎదుర్కోవాల్సిందే. నీలాంటి ఎంతోమందికి నువ్వొక రోల్‌మోడల్‌గా మారాలి. అలా ఉండాలంటే ఏదో ఒకటి సాధించాలి అంది. ఈలోపు ఒక టీవీలో సంగీత రియాలిటీషో జరుగుతుంటే నన్ను ఆడిషన్స్‌కి తీసుకెళ్లింది. అందులో నేను ఎంపికయ్యాను. కానీ చాలా భయం వేసేది. కాళ్లూ, చేతులూ చల్లగా అయిపోయేవి. ఆ పోటీలో టాప్‌టెన్‌ వరకు వెళ్లి ఎలిమినేట్‌ అయ్యాను. మరో షోలో అయితే... ఫస్ట్‌ రౌండ్‌లోనే ఇంటికొచ్చేశాను. అలాంటి సమయంలో మెడిటేషన్‌ నాకు చాలా ఉపయోగపడింది.

నా పాటని మెరుగుపరుచుకున్నా. ఈటీవీ ‘బ్లాక్‌’ షోలో విజేతగా నిలిచాను. ఆ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్లస్‌వన్‌ నుంచి హైదరాబాద్‌లోని నాసర్‌ స్కూల్లో చదువుకున్నాను. మా స్కూల్‌ కల్చరల్‌ టీంకి నాయకత్వం వహించేదాన్ని. నామీద నమ్మకంతో మా స్కూల్‌ నాకా బాధ్యత అప్పగించింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో మీడియా కోఆర్డినేటర్‌గా చేసేదాన్ని. అక్కడ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత.. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా కంపెనీలు.. మా దగ్గర అవకాశాలు లేవని చెప్పేశాయి. చివరికి ‘ఉబర్‌’లో నాకు ఉద్యోగం వచ్చింది. రెండున్నరేళ్లపాటూ సాఫ్ట్‌స్కిల్స్‌ట్రైనర్‌గా పని చేశాను.

నటి శ్రీదేవితో శ్రావ్య కణితి

ఐఎస్‌బీలో మొదటి విద్యార్థిని..

హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ఎంబీయే చేయాలనేది నా కల. మూడుసార్లు ప్రయత్నిస్తే.. మూడోసారి నాకా అవకాశం వచ్చింది. నిజానికి ఐఎస్‌బీలో చేరిన మొదటి విజువల్లీ ఛాలెంజెడ్‌ అమ్మాయిని నేనే. స్నేహితురాళ్లు బాగా సహకరించేవారు. ప్రొఫెసర్లు కూడా నాకోసం అదనంగా శ్రమపడేవారు. కారణం... గ్రాఫుల్లాంటి వాటిని నాకు చెప్పడం కష్టమయ్యేది వాళ్లకు. అయినా నేను వాడే సాఫ్ట్‌వేర్‌లకు అనుగుణంగా పాఠాలు తయారుచేసి అందించేవారు.

ఇక్కడ రెండేళ్ల కోర్సుని ఏడాదిలో పూర్తిచేస్తారు. కాబట్టి... చాలా వేగంగా చెబుతారు. ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడం కష్టమే అయినా ఫ్రెండ్స్‌, అమ్మానాన్నల సాయంతో త్వరగానే నేర్చుకున్నా. ఏప్రిల్‌లో నాకోర్సు పూర్తయ్యింది. జూన్‌లో నాకు ఒక విదేశీబ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేస్తున్నా కాబట్టి ఏ ఇబ్బందీ లేదు. చిన్నచిన్న వైఫల్యాలకే బెదిరిపోయి నాకే ఎందుకిలా అని పదేపదే ప్రశ్నించుకుంటూ నిరాశలోకి కూరుకుపోయేవారు ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి నా జీవితం కంటే పెద్ద ఉదాహరణ ఉండదేమో!

రేపొద్దున్న నువ్వు అడుగుపెట్టే ప్రపంచం ఇలానే ఉంటుంది. వాటిని ఎదుర్కోవాల్సిందే. నీలాంటి ఎంతోమందికి నువ్వొక రోల్‌మోడల్‌గా మారాలి... అని అమ్మ అన్నమాటలే నాకు ప్రేరణ...

ఇదీ చదవండిః అమ్మలూ.. ఈ పుస్తకం ఎదిగే మీ కూతుళ్ల కోసమే..!

Last Updated : Oct 7, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.