ETV Bharat / lifestyle

ఆ మాట కోసం పదేళ్లు ఎదురుచూశా!

పేగు పంచుకు పుట్టిన బిడ్డ ‘అమ్మా’ అని తొలిసారి పలికినపుడు తల్లి మనసు ఎంతో మురిసిపోతుంది. బాబు పెదాల వెంట ఆ మాట వచ్చినపుడు ఆ తల్లి మిగతా తల్లులతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ సంబరపడిపోయింది. ఎందుకంటే ఆ మాట పలికించడానికి దాదాపు పదేళ్లు శ్రమించిందామె. ఈ తర్వాత కూడా అంతే ఓర్పూ, నేర్పుతో మూగబోయిన ఎన్నో గొంతులు మాట్లాడేలా చేస్తోంది. అలా ఎందరో తల్లులకు వారి పిల్లలచేత ‘అమ్మా’ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇస్తున్నారు కర్రి ఉమాదేవి. ఆ ప్రయాణం గురించి ఆమె ఏం చెబుతారంటే..

mother became speech therapist for her son
ఆ మాట కోసం పదేళ్లు ఎదురుచూశా!
author img

By

Published : Nov 10, 2020, 12:21 PM IST

ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(అహ్మదాబాద్‌) నుంచి త్వరలో డిగ్రీ తీసుకోనున్నాడు మా అబ్బాయి రాహుల్‌. ఇది తల్చుకుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. దీనికోసం మావారు ఉమామహేశ్వరరావు, నేనూ చాలా కష్టపడ్డాం. మాకంటే ఎక్కువగా శ్రమించాడు రాహుల్‌.

అసలేం జరిగిందంటే...

నాన్నావాళ్ల సొంతూరు బొబ్బిలి. టాటా స్టీల్స్‌లో ఉద్యోగరీత్యా జంషెడ్‌పుర్‌లో ఉండేవారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. మావారిది సాలూరు. పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చా. ఏడాదికే రాహుల్‌ పుట్టాడు. బాబుకి అయిదు నెలలప్పుడు... పక్కనుంచి చప్పుడు చేస్తే చూసేవాడు కాదు. డాక్టరుకి చూపిస్తే ‘పెద్దయ్యాక సమస్య పోతుంది’ అన్నారు. జంషెడ్‌పుర్‌లో వైద్యుల్ని సంప్రదిస్తే వినికిడి సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ‘తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పరికరాలు పెట్టి చూద్దాం’ అన్నారు. తొమ్మిది నెలలప్పుడే చెవులకి పరికరాలు పెట్టించాం. వినికిడి సమస్య ఉన్నవాళ్లకి మాట కూడా రాదు. అందుకే అక్కడే స్పీచ్‌ థెరపీ ఇప్పించాం. నేనూ బాబుతోపాటు నేర్చుకున్నా. అక్కణ్నుంచి వచ్చి విజయనగరంలో ఉండేవాళ్లం. బాబు చేత రోజూ మాటలు ప్రాక్టీసు చేయించేదాన్ని. అయిదేళ్లు వచ్చినా మార్పులేదు. మరోసారి షెడ్‌పుర్‌లో చూపిస్తే... ‘మాట రావడం కష్టమే, బాబుని బధిరుల స్కూల్లో చేర్పించండి’ అనడంతో అక్కడే హిందీ మీడియం స్కూల్లో జాయిన్‌ చేశాం. నేనూ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా. మధ్యమధ్యలో డాక్టర్లకి చూపిస్తూనే ఉన్నాం. దిల్లీలో ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్‌ హన్స్‌ గారి గురించి తెలిసి వెళ్లాం. ‘కాక్లియర్‌ సర్జరీ చేసి చూద్దాం. కానీ, అయిదేళ్లలోపు వారికే దీన్లో సక్సెస్‌ ఉంటుంది. పెద్ద శబ్దాలు మాత్రం వినిపిస్తాయి’ అన్నారు. అప్పటికే బాబు ఎనిమిదో ఏట అడుగుపెట్టాడు. సర్జరీకి ఏడు లక్షలవుతుంది. మా స్థోమతకు మించిన ఖర్చు. కానీ రోడ్డు ప్రమాదాలైనా తప్పుతాయని సిద్ధమయ్యాం. దేవుడు ఈసారి మామీద దయచూపాడు. సర్జరీ పూర్తయి, పరికరాలు పెట్టిన మూడో రోజున స్పందించడం మొదలుపెట్టాడు రాహుల్‌. వాడికి అప్పటికే హిందీ చదవడం, రాయడం వచ్చు. డాక్టర్‌ సలహాతో స్పీచ్‌ థెరపీ ద్వారా పదాలు పలికించేదాన్ని. రెండు నెలలకు ‘అంమ’ అన్నాడు. ఆ మాట వినగానే నా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తర్వాత బాబుని తీసుకుని విజయనగరం వచ్చేశా. ఇక్కడ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో ఎవరూ చేర్చుకోకపోవడంతో ట్యూషన్‌కి పంపుతూ ఇంటి దగ్గరే ఇంగ్లిష్‌ నేర్పించా. తర్వాత ఏడాది ఓ స్కూల్లో చేర్చుకున్నారు. రెండేళ్లకు కాస్త మాట్లాడగలిగేవాడు. రాహుల్‌కి డ్రాయింగ్‌ బాగా ఇష్టం. అదే వాడి భవిష్యత్తు కావాలని ప్రత్యేకంగా అందులో శిక్షణ ఇప్పించాం. బాల చిత్రకారుడిగా ప్రధాని, రాష్ట్రపతి చేతులమీదుగా బహుమతుల్నీ అందుకున్నాడు. చదువులోనూ మెరుగయ్యాడు. ఇంటర్మీడియెట్‌ తర్వాత ఎన్‌ఐడీలో చేరతానన్నాడు. ప్రవేశ పరీక్షలో ఫస్ట్‌ ర్యాంకు సంపాదించాడు. వైద్య పరికరాల డిజైనింగ్‌ రంగంలోకి వెళ్లాలనేది వాడి లక్ష్యం.

శిక్షకురాలిగా మారా...

రాహుల్‌కి మాట తెప్పించే ప్రయత్నంలో ఎంతో అనుభవం సంపాదించా. ప్రస్తుతం సక్షమ్‌(దివ్యాంగుల కోసం పనిచేసే సంస్థ) జాతీయ కార్యనిర్వహక కమిటీ సభ్యురాలిగా ఉన్నా. స్పీచ్‌ థెరపీ అవసరమయ్యే పిల్లలకు నామ మాత్రపు ఫీజు తీసుకుంటూ శిక్షణ ఇస్తుంటా. దీనికి ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఏటా అయిదారుగురు పిల్లల్ని తీసుకుంటా. పిల్లలతో పాటు తల్లి కచ్చితంగా ఉండాలని చెబుతా. ఎందుకంటే ఇక్కడ నేర్పేవి ఇంటి దగ్గర సాధన చేయించాలి. ఆ సమయంలో సెలవులు పెట్టనీయను. పిల్లల్ని తీసుకుని చాలా దూరం నుంచీ శిక్షణ కోసం వస్తుంటారు. బెంగళూరులో ఉంటున్న ఓ తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తమ పాప కోసం ఏడాదిగా విజయనగరంలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు. గత పన్నెండేళ్లలో 50 మందికి శిక్షణనిచ్చా. తమ పిల్లలు మాట్లాడటం చూశాక తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతుంటాయి. అలాంటి వారిలో కొందరిని శిక్షకులుగా మారమని అడుగుతాను. కానీ చాలామంది వాళ్లకి అంత ఓపిక, సమయం లేవంటారు. కష్టంమీద ఈ మధ్యే విజయనగరానికి చెందిన జ్యోతివర్మని ఒప్పించాను. నాలాంటి శిక్షకుల్ని పదిమందినైనా తయారుచేయాలనేది నా లక్ష్యం.

బీకామ్‌ తర్వాత బైపీసీ...

నాన్నకు తెలుగు భాషంటే అభిమానం. స్కూల్‌ రోజుల్లోనే తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నా. బీకామ్‌ చదివాను. సైన్స్‌ చదువుకుంటే స్పీచ్‌ థెరపీలో ఇంకొన్ని శాస్త్రీయమైన అంశాలు తెలుస్తాయనిపించింది. మూడేళ్ల కిందట ఇంటర్మీడియెట్‌-బైపీసీ కట్టి పాసయ్యాను. ప్రత్యేక అనుమతితో స్పెషల్‌ డీఎడ్‌ చేయాలని చూస్తున్నా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.