ఆమెది మిషన్ పూర్ జిల్లా తానుగా సొంగ్ గ్రామ్. ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా తామరపూలు పూసే లో-టాక్ సరస్సు ఉన్న గ్రామం అది. వృక్షశాస్త్రంలో పట్టా పొందిన శాంతి... వాటిని ఉపయోగించి ఏదైనా వినూత్నంగా చేయాలనుకుంది. అది అక్కడివారికి ఉపాధి కల్పించాలని ఆలోచించింది. దాంతో తామరకాడలతో నూలు తయారీ దిశగా అడుగులు వేసింది. అందుకోసం ఓ చిన్నపాటి పరిశోధన చేసింది. కొన్ని ప్రయోగాలను నిర్వహించింది. చివరకు రెండేళ్ల క్రితం కొంత నూలు తయారు చేసి గుజరాత్లోని ఓ ల్యాబొరేటరీకి పంపించింది. దానికి అనుమతి రావడంతో దారాలను తయారు చేసి వస్త్రం రూపొందిస్తోంది. దాన్ని షాల్స్ టైలుగా తీర్చిదిద్దుతోంది. తాను ఉపాధి పొందడమే కాదు.. మరో పదిహేను మందికీ ఉద్యోగం ఇవ్వగలిగింది. మరో ఇరవై మందికి శిక్షణ అందిస్తోంది.
ఎప్పటికప్పుడు వచ్చే మార్పులనూ, మార్కెట్‌నూ అందిపుచ్చుకుని సాగిపోవడమే వ్యాపారం. అందుకే కొవిడ్-19 పరిస్థితులకు అనుగుణంగా ఆ వస్త్రాన్ని ఉపయోగించి మాస్కుల తయారీ మొదలు పెట్టింది. ఈ ప్రయోగం గురించి తెలిసి... ప్రధాని మోదీ సహా మరెందరో ప్రముఖులు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 'ఈ ప్రయోగం లోటస్ ఫార్మింగ్ అండ్ టెక్స్టైల్ రంగం కొత్త మార్గాలను ఆవిష్కరించనుంది' అని విజయశాంతి చెబుతున్నారు.
ఇదీ చదవండిః గేల్‌ను తలపిస్తున్న ఈ బుడతడు ఎవరు?