ETV Bharat / lifestyle

PRAYANA LABS: వేల గృహిణులకు ఆర్థిక స్వావలంబన - కమ్​బాక్​ టూ కెరీర్ మిషన్

కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి విద్యార్హతను సైతం మరచిపోయే మహిళలకు, విరామం తర్వాత తిరిగి ఉద్యోగం లేదా వాణిజ్యంలో అడుగుపెట్టాలనే ఆసక్తి ఉన్నవారికి చంద్రవదన చేయూతగా నిలుస్తోంది. అలాగని ఈమె పెద్ద వాణిజ్యవేత్త కూడా కాదు. అయినా వేలమంది గృహిణులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్న చంద్రవదన స్ఫూర్తి కథనమిది.

PRAYANA LABS
ప్రయాణా ల్యాబ్స్‌
author img

By

Published : Aug 3, 2021, 10:38 AM IST

కొచ్చిన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వ విద్యాలయంలో ఎంబీఏ, పీహెచ్‌డీ స్కాలర్‌ అయిన చంద్రవదన ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఓ ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు పెళ్లి అయ్యింది. ఆ తర్వాత ప్రసవం కోసం తీసుకున్న సెలవులను అయిదేళ్లు పొడిగించుకుంది. ఆ సమయంలో సైకాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. కొన్నాళ్లు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, రేడియో జాకీగా మనసుకు నచ్చిన అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టింది. తర్వాత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా చేరింది.

ఉద్యోగంతో పాటు సొంతంగా ఏదైనా చేయాలనుకునేది. దాంతో బయటకు వచ్చేసి, ‘4ట్యూన్‌ ఫ్యాక్టరీ’ పేరుతో కన్సల్టెన్సీని ప్రారంభించింది. కుటుంబం మద్దతు ఇవ్వకపోయినా ధైర్యంగా ఒంటరిగానే తన కలను నెరవేర్చుకోవాలని సాహసం చేసింది.

మహిళల కోసం...

తన కన్సల్టెన్సీ ద్వారా చాలామంది మహిళల గురించి తెలుసుకోవడానికి చంద్రవదనకు అవకాశం దక్కింది. కొందరు చదువుకున్నా ఉద్యోగాలు చేయలేకపోవడం, సృజనాత్మకత, ఆలోచనాశక్తి ఉండీ తమ కాళ్లపై తాము నిలబడలేకపోవడం గుర్తించింది. వారికి ప్రోత్సాహాన్ని అందించాలనుకుంది. వారి అర్హతబట్టి ఉద్యోగం, ఆసక్తి ఉంటే వాణిజ్యంలోకి అడుగు పెట్టేలా చేయూతనివ్వడం, నూతన ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా 2017లో ‘ప్రయాణా ల్యాబ్స్‌’ను స్థాపించింది.

అర్హత, ఆలోచనాశక్తి ఉండి కూడా మహిళలు వాటిని వినియోగించకపోతే అది వారి కుటుంబానికే కాదు, దేశార్థికపరిస్థితిపైనా ప్రభావం చూపిస్తుందని చెబుతుంది చంద్రవదన. ‘చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల తప్పనిసరిగా ఉంటుంది. వాటిని నెరవేర్చుకో మంటూ వారిలో అవగాహన తేవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టా. అందుకే ముందుగా పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించా. ‘కమ్‌బ్యాక్‌ 2 కెరీర్‌ మిషన్‌ (come back to carrer mission)’ పేరుతో పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వారికి కెరీర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, గృహిణులను వారికిష్టమైన కెరీర్‌లో అడుగుపెట్టేలా కూడా చేయడానికి కృషి చేశా. ‘ప్రయాణాహబ్‌’ పేరుతో ఎర్నాకుళం, కొచ్చిన్‌ కేంద్రాలుగా సంస్థను ప్రారంభించా. వీటి ద్వారా గృహిణులకు ఉచితంగానే ఆన్‌లైన్‌లో కెరీర్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించే దాన్ని. ఈ నాలుగేళ్లలో దాదాపు 40వేలమందికిపైగా గృహిణులు, వాణిజ్యవేత్తలు, విద్యావంతులు ఈ వేదిక వల్ల లబ్ది పొందారు. వీరందరికీ వారి ఆసక్తికి తగ్గట్లుగా కార్పొరేట్‌, ప్రభుత్వసంస్థలతో అనుసంధానం చేసి, వాటి ద్వారా తాము తయారుచేసిన ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మార్చగలిగా. అంతేకాదు, ‘షీ మార్కెట్స్‌’ పేరుతో స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించి, గృహిణులు పచ్చళ్లు, బ్యాగులు, తదితర వస్తువులను విక్రయించడానికి ప్రోత్సాహాన్ని అందించా. దీంతో వారంతా ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు’ అని వివరించింది చంద్రవదన.

పది లక్షలమంది...

వచ్చే రెండేళ్లలో పది లక్షల మందిని ఆర్థికంగా నిలబెట్టడానికి కృషి చేస్తోంది చంద్రవదన. ఇందులో సభ్యత్వానికి రూ.199 రుసుము చెల్లించాలి. ఈమె చేస్తున్న కృషికి అమెరికా, కేరళ రాష్ట్రప్రభుత్వం నిధులు అందిస్తున్నాయి. గతంలో యునైటెడ్‌ నేషన్స్‌ నేతృత్వంలో ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎంప్రెటెక్‌ సదస్సులో ‘వుమెన్‌ ఇన్‌ బిజినెస్’ అవార్డును తనకు అందించి గౌరవించారు.

ఇదీ చూడండి: Health tips: తరుచూ అలసిపోతున్నారా?.. అయితే ఇలా చేయండి!

AAPI PRESIDENT: జన్మభూమి రుణం తీర్చుకోవాలని... 37 కోట్లు ఇచ్చాం...

పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.