ETV Bharat / lifestyle

ఆ సమస్యలతో ఇక చచ్చిపోతానేమో అనుకున్నా! - aaliyah kashyap shares

ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఆలియా కశ్యప్‌.... సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ స్టార్‌ కిడ్‌ టీనేజ్‌ నుంచే మానసిక అనారోగ్యంతో బాధపడుతోందట. ఈ క్రమంలో మానసిక అనారోగ్యానికి సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

aaliyah kashyap opens up on battling mental health issues
ఆ సమస్యలతో ఇక చచ్చిపోతానేమో అనుకున్నా!
author img

By

Published : May 4, 2021, 12:01 PM IST

ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్... పేరేదైనా మనసు మీద దెబ్బకొట్టే ఈ జబ్బులతో చాలామంది తమలో తామే కుమిలిపోతుంటారు. ఒకవేళ తమ సమస్య గురించి ఇతరులతో పంచుకుని బాధను తగ్గించుకుందామంటే... ఎక్కడ పలుచనైపోతామో... నలుగురూ ఏమనుకుంటారోనన్న భయం వారిని మరింత కుంగుబాటుకు గురి చేస్తుంది. చుట్టూ ఎందరున్నా ఒంటరిగా మార్చేస్తుంది. ఒక్కోసారి ప్రతికూల ఆలోచనలు బాగా పెరిగిపోయి చనిపోదామన్న ఆలోచనలు కూడా వస్తాయి. తన విషయంలోనూ ఇలాగే జరిగిందంటోంది ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఆలియా కశ్యప్‌. సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ స్టార్‌ కిడ్‌ టీనేజ్‌ నుంచే మానసిక అనారోగ్యంతో బాధపడుతోందట. అంతేకాదు.. ప్రతికూల ఆలోచనల కారణంగా చాలాసార్లు చనిపోవాలనుకున్న ఆమె... ప్రస్తుతం వాటినుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్యానికి సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

నేనూ మానసిక అనారోగ్యంతో బాధపడ్డాను!

ఆలియా కశ్యప్... ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌- ఫిల్మ్‌ ఎడిటర్‌ ఆర్తి బజాజ్‌ల గారాల పట్టిగా ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అమెరికాలో చదువుకుంటోన్న ఈ అమ్మడు నిత్యం తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తుంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ సొగసరిని అనుసరించే ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా స్టార్‌కిడ్‌గా సెలబ్రిటీ స్టేటస్ను సొంతం చేసుకుంటోన్న ఆలియా తాజాగా మానసిక అనారోగ్యానికి సంబంధించి తన అనుభవాలను పంచుకుంది. తద్వారా తనలాంటి బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది.

ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాను!

‘టీనేజర్‌గా ఉన్నప్పుడే అంటే 13-14 ఏళ్ల వయసులోనే నేను యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యల బారిన పడ్డాను. అయితే ఆ సమయంలో వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారి బలంగా అనుకుంటే వీటి నుంచి సులభంగా బయటపడొచ్చు అనుకున్నాను. అది కూడా మన చేతుల్లోనే ఉందనుకున్నాను. మన జీవితాన్ని నాశనం చేసేంత ఇబ్బందులు పెట్టవనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా ఈ సమస్యల నుంచి బయటపడలేకపోయాను’.

అసలు నేనెందుకు బతకాలి అనుకున్నా!

‘ఇక గతేడాది నవంబర్‌లో నేను కరోనా బారిన పడ్డాను. అప్పటిదాకా కౌన్సెలింగ్‌, థెరపీ సెషన్‌లు తీసుకుంటూ క్రమంగా మానసిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేను హోం క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండిపోయాను. దీంతో ప్రతికూల ఆలోచనలు బాగా పెరిగిపోయాయి. తీవ్ర కుంగుబాటుకు లోనయ్యాను. తెలియకుండానే నిరంతరం ఏడుస్తూనే ఉన్నాను. నా జీవితానికి ఓ అర్థం లేదనుకునే స్థాయికి వెళ్లిపోయాను. అసలు నేను ఎందుకు బతకాలి? దేని కోసం బతకాలి?ఎందుకు అందరికీ భారంగా మారాలి? అని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను’.

కనీసం బెడ్‌ మీద నుంచి లేవలేకపోయాను!

ఈ ప్రతికూల ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనీయలేదు. నా ఆరోగ్యాన్ని కూడా బాగా దిగజార్చాయి. చివరకు నన్ను ఆస్పత్రి బెడ్‌ మీదకు చేర్చాయి. నా పరిస్థితి గురించి తెలుసుకున్న అమ్మానాన్నలు వెంటనే అమెరికాకు వచ్చేశారు. వారు డిసెంబర్‌ నుంచి జనవరి దాకా నా ఆరోగ్యం కుదుటపడేదాకా నా వెంటే ఉన్నారు. ఇక అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో మార్చి చివరి వారంలో నా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సడన్ గా నా శరీరం బాగా నీరసించిపోయింది. కనీసం బెడ్‌ మీద నుంచి లేవలేకపోయాను. షవర్‌ దాకా వెళ్లలేకపోయాను. ఏమీ తినలేకపోయాను’.

ఛాతీలో నొప్పిగా అనిపించింది!

‘ఇక ఏప్రిల్‌ మాసంలో ఒకరోజైతే నా శరీరం పూర్తి అచేతనంగా మారిపోయింది. గుండె కొట్టుకునే వేగం క్రమంగా పెరిగిపోయింది. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. ఆ క్షణం నాకేమైందో నాకే అర్థం కాని పరిస్థితి. గతంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా మరీ ఇంత అధ్వాన్నమైన పరిస్థితి వస్తుందని ఏ మాత్రం ఊహించలేకపోయాను. ఒకానొక సమయంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. భరించలేక ఆస్పత్రికి వెళితే యాంగ్జైటీ అటాక్‌ అని చెప్పారు. నాకు తెలిసి నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజు అదే. ఎందుకంటే ఆ రోజు ఏ కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనయ్యాను. ఆ రోజు మొదలు వరసగా పదిరోజుల పాటు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాను. గుండె కొట్టుకునే వేగం పెరగడంతో పాటు ఛాతీలో నొప్పిగా అనిపించింది. ఈ సమయంలో నేను ఏడ్చినట్లు జీవితంలో మరెప్పుడూ ఏడవలేదు. దీంతో ఇటీవల ఓ సైకియాట్రిస్ట్‌ను కలిశాను. అప్పటి నుంచి నా పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది’ అని తన అనుభవాలను గుది గుచ్చిందీ ముద్దుగుమ్మ.

ఒత్తిడి, ఆందోళనల వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు బయటకు చెప్పుకొంటే ఎవరో ఏదో అనుకుంటారని దాచిపెట్టకుండా, ఆలియా లాగా సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో అవసరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.