ETV Bharat / lifestyle

ఒకరికొకరు ఆసరాగా ఉన్నారు.. సవాళ్లని విజయాలుగా మార్చారు - మసాల వ్యాపారం

మగపిల్లాడే కావాలన్న అత్తింటి ఒత్తిడితో ఏడుగురు ఆడపిల్లలకు తల్లయ్యిందామె. చిన్న వయసులో భర్త కన్నుమూస్తే... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. చదువుకోకపోయినా భర్త వ్యాపారాన్ని అందిపుచ్చుకుంది. అడుగడుగునా ఆటంకాలను అధిగమిస్తూ తన పిల్లలందరినీ తీర్చిదిద్దింది. ఈ పోరాటంలో ఆ అమ్మకు సైన్యం ఆ సప్త లక్ష్ములే. ఒకరికొకరు ఆసరాగా సవాళ్లని విజయాలుగా మలుచుకున్న భగవతి తన జీవన పోరాటాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

single-mother-and-her-7-daughters-success-story
ఒకరికొకరు ఆసరాగా ఉన్నారు.. సవాళ్లని విజయాలుగా మార్చారు
author img

By

Published : Jun 26, 2021, 10:29 AM IST

ఆడపిల్లలకు చదువు అవసరం లేదు. అత్తింట్లో ఒదిగిపోయి.. మంచి కోడలిగా మెలగడమెలానో తెలిసుంటే చాలు అనుకొనే కుటుంబంలో పుట్టా. ఎనిమిదో తరగతి చదువుకున్నా. మాది అజ్‌మేర్‌. జోధ్‌పూర్‌కు చెందిన మోహన్‌లాల్‌తో 22 ఏళ్లప్పుడు పెళ్లైంది. తొమ్మిదిమంది అన్నదమ్ములు... 30మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టాను. నాకు ఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ అత్తమామలు దెప్పిపొడిచేవారు. మగపిల్లాడు కావాల్సిందే అన్నారు. అలా అబ్బాయి కోసం ఎదురు చూస్తుండగానే ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. ఉష, పూనమ్‌, నీలమ్‌, నిక్కి, కవిత, రీతూ, ప్రియ. వరసగా ఏడు కాన్పులంటే ఊహించండి ఎంత నరకమో. ఓపిక నశించి ఇక పిల్లలు చాలని ఆయనతో చెప్పా. ఇంతమంది ఆడపిల్లలని ఉమ్మడి కుటుంబంలో పెంచడం కష్టమన్నారు అత్తింటివాళ్లు. దాంతో బయటకు వచ్చేశాం. ఆయన మసాలా దినుసుల వ్యాపారం చేసేవారు. నాకు చదువులేదు కాబట్టి కనీసం పిల్లలనైనా చదివిద్దామన్నా. ఆయన సందేహించారు. ‘అవసరమైతే ఒక్క పూటే తిందాం.. పిల్లల్ని మాత్రం చదివించాల్సిందే’ అని పట్టుబట్టా. మొత్తమ్మీద వాళ్లని మంచి స్కూళ్లలో చేర్పించాం. అంతా సజావుగా సాగిపోతోంది అనుకుంటుండగా ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికి నా వయసు 44.

ఒంటరిగా పయనం...

పిల్లలు... నేను. ఎవరి సాయమూ లేదు. అప్పటికి మా పెద్దమ్మాయికి 20 ఏళ్లు. చిన్నదానికి ఎనిమిది. పిల్లల్ని చదివించాలన్న ఆలోచన తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన వదిలివెళ్లిన మసాలా దినుసుల వ్యాపారమే ఆధారమైంది. ఆయన చనిపోయిన మూడోరోజున నా నిర్ణయాన్ని చెప్పా. అత్తగారి కుటుంబం యుద్ధానికి వచ్చింది. ఆడవాళ్లు వ్యాపారమంటూ బయటికెళితే పరువు పోతుందని విరుచుకుపడ్డారు. ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. వాళ్లతో ‘నా పిల్లల్ని పోషించుకోవాలి... వ్యాపారాన్ని చూసుకోవాల’ని గట్టిగా చెప్పాను. ‘ఇక నీతో మాకే సంబంధమూ లేదు...’ అని తెగదెంపులు చేసుకుని మరీ షాపు తాళాలిచ్చారు.

ఎగతాళి చేసేవారు...

మా దుకాణం జోధ్‌పుర్‌ కూరగాయల మార్కెట్లో ఉండేది. నేను వెళ్లిన మొదటిరోజునే గుసగుసలు... వెకిలి నవ్వులు. తర్వాత అవి ఇంకా పెరిగాయి. నా దగ్గర పని చేయడానికి ఒక్కరూ రాలేదు. అన్ని పనులూ నేనే చేసుకునేదాన్ని. పర్యాటకప్రాంతం కావడంతో విదేశీయులెక్కువగా వస్తారు. నాకేమో ఇంగ్లిష్‌ రాదు. పెద్ద అమ్మాయిలిద్దరూ నాకు అండగా నిలిచారు. వాళ్లు నాతో ఉండేవారు. మిగతా పిల్లలకి బాక్సులు సర్ది స్కూల్‌కు పంపించి షాప్‌కి వచ్చేదాన్ని. మా దుకాణాన్ని వెతుక్కుంటూ వచ్చే వినియోగదారుల్ని చుట్టుపక్కల వ్యాపారులు లేనిపోనివి చెప్పి వెనక్కి పంపేవారు. రకరకాల అడ్డంకులు సృష్టించే వారు. ఇదంతా ఆడవాళ్లం వ్యాపారం చేస్తున్నామనే. ఒక్కోసారి ఏడుపొచ్చేది. నాకు నేనే ధైర్యం చెప్పుకొనేదాన్ని. మా అమ్మాయిలు కూడా ధైర్యం చెప్పేవారు. ఇన్ని కష్టాలమధ్య రెండో దుకాణాన్ని తెరిచాం. అక్కడా ఎదురుదెబ్బే. ఆడదాన్ని కాబట్టి నాకేమీ తెలియదనుకుని దుకాణాన్ని వేరే వాళ్ల పేరున రిజిస్టర్‌ చేశాడు అమ్మకందారు. ఆ కేసుని కోర్టులో గెలవడానికి అయిదేళ్లు పట్టింది.

ఈలోపు పిల్లల బాగోగుల్ని చూసుకుంటూ వ్యాపారాన్ని పెంచుకుని మరో నాలుగు కొత్త దుకాణాలని ప్రారంభించాం. మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నాణ్యమైన మసాలా దినుసులను తెప్పిస్తుంటాం. 50 రకాల దినుసులు, పొడులు, 10 రకాల టీపొడులు, మేం సొంతంగా చేసే 25 రకాల మసాలా పొడులు మొత్తం కలిపి 100 రకాలు విక్రయిస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు 50 మంది పని చేస్తున్నారు. ఒకరు ఎంబీఏ, ఇంకొకరు ఇంజినీరింగ్‌ ఇలా పిల్లలందరూ పెద్ద చదువులే చదివారు. ఒకరితర్వాత ఒకరు అందరూ వ్యాపారంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. నలుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. నేను, నా పిల్లలు కలిసి సాధించిన విజయాలపై బీబీసీ డాక్యుమెంటరీ తీసింది. మీ జీవితం స్ఫూర్తిదాయకం అంటూ చాలా దేశాల నుంచి మెసేజ్‌లు వస్తూంటాయి. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటే అందరూ తనలా జీవితాన్ని గెలవచ్చు అంటున్నారు.

ఇదీ చూడండి: Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.