హార్వెస్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్‌లో జరిగింది. యంత్రం అదుపుతప్పి బోల్తా పడి సుదర్శన్ అనే రైతు మృతి చెందగా, మరో రైతు మల్లేశం తీవ్రంగా గాయపడ్డాడు.
వరి పంట కోయడానికి సోమవారం ఉదయం హార్వెస్టర్ తీసుకొని వెళ్తుండగా మార్గంమధ్యలో యంత్రం అదుపుతప్పి బోల్తాపడింది. సుదర్శన్ అనే రైతు హార్వెస్టర్ కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. యజమాని మల్లేశానికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యంత్రం కింద ఇరుక్కుపోయిన సుదర్శన్ మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రెండేళ్ల బాలుడు అదృశ్యం.. రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు