ETV Bharat / jagte-raho

'నా బిడ్డ చావుకు కారణం ఆ వివాహితుడే' - హైదరాబాద్​ వార్తలు

వనస్థలిపురం పోలీస్​ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేందర్ అనే వివాహితుడిని నమ్మి.. మానసికంగా కుంగిపోయి తన బిడ్డ చనిపోయిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

young women suicide at kammaguda at vanasthalipuram
'అతడి వల్లే నా బిడ్డ చనిపోయింది'
author img

By

Published : Jan 16, 2021, 10:09 PM IST

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్​ స్టేషన్ పరిధిలోని కమ్మగూడలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి సరూర్​నగర్​కు చెందిన నరేందర్​ అనే వివాహితుడే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మానసికంగా కుంగిపోయింది..

ఇంజినీరింగ్ చదివిన తన కూతురు ఒక సాఫ్ట్​వేర్​ కోర్స్​లో శిక్షణ పొందేదని... ఈ క్రమంలో నరేందర్​తో పరిచయం ఏర్పడిందని మృతురాలి తండ్రి దేవరకద్ర నరేందర్​ గౌడ్​ తెలిపాడు. అమాయకురాలైన తన కూతురు నరేందర్ మాయలో పడి మానసికంగా కుంగిపోయి.. కుటుంబ సభ్యులందరితో వింతగా ప్రవర్తించేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే తన కూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నాడు. దీనికి కారకుడైన నరేందర్​ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: పాము కాటుకు ఇంటర్​ విద్యార్థిని బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.