ETV Bharat / jagte-raho

ఇంట్లోంచి యువతి అదృశ్యం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు - Young woman missing in papannapeta

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆర్కెల గ్రామంలో ఓ యువతి అదృశ్యమైంది. ఇంట్లో వారంతా పనులకు వెళ్లి.. తిరిగి వచ్చే సరికి ఇంట్లో కనిపించలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకి లభించకపోవడంతో ఆమె తండ్రి రాములు పాపన్నపేట పోలీసులను ఆశ్రయించాడు.

Young woman missing in Papanna peta mandal
పాపన్నపేట మండలంలో యువతి అదృశ్యం
author img

By

Published : Dec 8, 2020, 7:28 PM IST

యువతి అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆర్కెల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి రాములు కూతురు స్వాతి( 19) మండల పరిధిలో గల అబ్లాపూర్ గ్రామంలో డిగ్రీ చదువుకుంటోంది. గత నెల 28వ తేదీన ఆమె తండ్రి రాములు కూతురు పెళ్లి చేద్దామని ఆర్కెలకు తీసుకొచ్చాడు.

ఈ నెల 30వ తేదీన ఉదయం ఇంట్లో వారంతా పనులకు వెళ్లారు. స్వాతి ఒక్కతే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తండ్రి రాములు ఇంటికి వచ్చేసరికి లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పాపన్నపేట ఎస్సై సురేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: భూపాలపల్లి జిల్లాలో ట్రాక్టర్, పోలీస్ వాహనం ఢీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.