వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలానికి చెందిన దామెర మానస(24) డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. గత మూడు రోజులుగా తనకు కొత్త సెల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ ఉంది. తల్లిదండ్రులు నిరాకరించగా.. అప్పటి నుంచి భోజనం చేయడం లేదు.
మంగళవారం ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న మానస పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు వచ్చేసరికి కిందపడిపోయి ఉంది. బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు