భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. అరటి పండ్లు విక్రయిస్తూ.... జీవనం కొనసాగిస్తున్న కొందరు యువకులు.. గంజాయికి బానిస అయ్యారు.
ఈ క్రమంలో అరటి పండ్లు కొనేందుకు వచ్చిన వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనితో ఆమె భర్త ఆగ్రహించగా కత్తులతో ఆయనను వెంబడించారు. సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోకి సదరు వ్యక్తి వెళ్లి తల దాచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రవేశించిన ఆ వ్యక్తిపై, పోలీసులపై యువకులు దాడిని కొనసాగించారు. ట్రాఫిక్ పోలీసులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం