మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ సమీపంలోని దుందుభి వాగులో విషాదం చోటుచేసుకుంది. ఏళ్ల తరువాత నిండుగా ప్రవహిస్తోన్న దుందుభి వాగును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాగులో ఈత కొడుతూ... సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే... అఫ్రోజ్ అనే 22 ఏళ్ల యువకుడు ఈత కొడుతూ సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ప్రమాద వాశాత్తు నీటిలో పడిపోయాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అందరూ చూస్తుండగానే... అఫ్రోజ్ కొట్టుకుపోయాడు.
స్థానికులు స్పందించి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం తెలిసి అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించినా.... ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత వెతికినా వాగు ఉద్ధృతికి అఫ్రోజ్ కన్పించలేదు. ఈ క్రమంలో... ప్రజలెవ్వరూ వాగు వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.