ETV Bharat / jagte-raho

చాంద్రాయణగుట్టలో వ్యక్తి మృతి... భార్యే హత్య చేయించిందంటూ ఫిర్యాదు - young man dead in chandrayanagutta

చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. నసెర్​ అనే వ్యక్తి అతని ఇంట్లోనే అనుమానస్పదంగా మృతి చెందారు. మృతుని భార్యే మరొకరితో కలిసి హత్య చేయించిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

young man Suspicious death in chandrayagutta in hyderabad
చాంద్రాయణగుట్టలో వ్యక్తి మృతి... భార్యే హత్య చేయించినట్లు ఫిర్యాదు
author img

By

Published : Oct 18, 2020, 7:32 PM IST

చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. హైదరాబాద్ పాతబస్తీలోని ఇంద్రానగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. నసెర్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఇంద్రా నగర్​లో​ ఉంటూ... పెట్రోల్ బంక్​లో పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆదివారం ఉదయం తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి, గొంతు నొక్కినట్లు మృతుడి భార్య తెలిపారు. సమీపంలోనే మృతుడి ఇంటికి వెళ్లి అతని తల్లి, సోదరునికి విషయాన్ని వివరించగా... అపస్మారక స్థితిలో ఉన్న నసెర్​ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.

మృతుడి భార్యనే మరొకరితో కలిసి హత్య చేసినట్లు మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చాంద్రాయణగుట్ట పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: మంగపేట అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.