హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ తానుంటున్న ప్రైవేటు వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ మున్నిసా(25) నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ పంజాగుట్ట పరిధిలోని ప్రణవి వసతిగృహంలో తన సోదరితో కలిసి ఉంటోంది.
రాత్రి మృతురాలి సోదరి ఆయేషా వసతిగృహానికి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమె 108కు ఫోన్ చేయగా అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి పరిశీలించగా... అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: తండ్రి మందలించాడని కుమారుడి బలవన్మరణం