సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్ బూడిదగడ్డలో నివాసముంటున్న మంజుల అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. సెప్టెంబర్ 2న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది.
చీకటి పడినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను వాకబు చేసినా ఫలితం లేకపోయింది. అనుమానంతో సెప్టెంబర్ 5న లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.