యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాలకు చెందిన యువ రైతు కచ్చిగళ్ల విజయ్ (32) బుధవారం తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి పడిపోయారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో ఆందోళన చెందిన అతని తండ్రి సోమయ్య వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
విజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆవేదన చెందిన విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి సోమయ్య తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్పై సుప్రీం తీర్పు రిజర్వు