ఏపీలోని కడప జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నూతన ఏడాది వేడుకల దృష్ట్యా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులే ఈ వివాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగినట్లు తెలిపారు. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఇంటిపై మహేశ్వర్ రెడ్డి వర్గీయులు వేటకొడవళ్లు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు.
ఆత్మరక్షణ కోసం ఆయన తన వద్దనున్న లైసెన్స్ తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణలో ముగ్గురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోందని అన్నారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: జంగా రాఘవరెడ్డికి 5 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్