ETV Bharat / jagte-raho

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు - ఆత్మహత్య చేసుకోడానికి యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకోడానికి యత్నించిన ఓ యువకుడిని బీబీనగర్​ పోలీసులు కాపాడారు. రైల్వే ట్రాక్​పై పడుకున్న యువకుడిని రక్షించి... కౌన్సిలింగ్​ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లో జరిగింది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు

author img

By

Published : Jan 29, 2021, 4:06 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు రక్షించారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్​పై పడుకుని ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని రక్షించారు.

మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన నాగరాజు... కుటుంబ కలహాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోడానికి రైల్వేట్రాక్​పై పడుకున్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని కాపాడి... పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి కౌన్సిలింగ్​ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లు హరినాయక్, సైదులును రాచకొండ సీపీ, భువనగిరి జోన్ ఇంఛార్జి డీసీపీ యాదగిరి అభినందించారు.

ఇదీ చూడండి: తల్లీ, కుమార్తె ఆత్మహత్య... కుటుంబ కలహాలే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.