ETV Bharat / jagte-raho

వివాహిత అనుమానాస్పద మృతి.. వరకట్న వేధింపులే కారణం?

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​మండల పరిధిలో చోటు చేసుకుంది. మహిళ మృతికి అదనపు కట్నం వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని.. ఆమె మరణం మీద తమకు అనుమానాలున్నాయని మృతురాలి బంధువులు ఆరోపించారు.

Women suspected die in gadwal district Alampur
వివాహిత అనుమానాస్పద మృతి.. వరకట్న వేధింపులే కారణం?
author img

By

Published : Oct 16, 2020, 3:20 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి తన మొదటి కూతురు సాహితిని అదే గ్రామానికి చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ విక్రమ్​కుమార్ రెడ్డికి ఇచ్చి 2016లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో 50 తులాల బంగారం, రూ.10 లక్షల కట్నం కానుకగా ఇచ్చారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం డిమాండ్​ చేయగా అది కూడా అప్పజెప్పారు. శుక్రవారం నాడు తెల్లవారేసరికి విక్రమ్​ రెడ్డి ఇంట్లో అందరూ ఏడుస్తుంటే.. చుట్టుపక్కల వారు విషయం ఏంటని ఆరా తీశారు. సాహితి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఏడుస్తూ సమాధానమిచ్చారు.

సాహితీ ఆత్మహత్య సమాచారం అందుకున్న ఆమె పుట్టింటి వారు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కావాలనే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అలాగే ఉంచకుండా ఉరి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకపోవడం పట్ల అనుమానాలున్నాయన్నారు. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తహశీల్దార్​ మదన్​మోహన్​ ఆస్పత్రికి చేరుకొని మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శ్రీరాములపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.