పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలకేంద్రానికి చెందిన రాజమణి అనే మహిళా రైతు.. విద్యుదాఘాతంతో పొలంలో మరణించింది. రాజమణి.. తనకున్న పొలంలో పత్తి పంట సాగు చేస్తోంది. గురువారం ఉదయం పంటకు మందులు పిచికారి చేసేందుకు వెళ్లింది.
పొలం మధ్యలో నుంచి వెళ్తున్న ఎల్టీ విద్యుత్ లైన్ తీగలు తెగి పడి ఉండగా.. వాటిని గమనించని రాజమణి.. ఆ వైర్లకు తగిలి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: మంజీరా నదిలో చిక్కుకున్న ఐదుగురు.. రక్షించాలంటూ వినతి