విధులకు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్ లారీ ఢీ కొని ఓ మహిళ మృత్యువాత పడింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన సుశీలమ్మ(54).. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా లారీ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంట్ షాక్‌తో ఉద్యోగి మృతి!