ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. మహిళ మృతి - siddipet district road accident

ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటన సిద్దిపేట జిల్లా మలుగు మండలం వంటిమామిడిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

woman died and one injured in road accident in siddipet
బైక్​ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.
author img

By

Published : Oct 16, 2020, 12:06 PM IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి రాజీవ్ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సింగన్నగూడ గ్రామానికి చెందిన నర మల్లేశం-యాదమ్మ దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం వంటిమామిడి మార్కెట్​ నుంచి కూరగాయలు తీసుకెళ్లి గ్రామంలో విక్రయిస్తుంటారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వంటిమామిడి కూరగాయల మార్కెట్​కు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లేశాన్ని ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.