ఈనెల 26న సంగారెడ్డి జిల్లా భానూరు గ్రామానికి చెందిన మంగలి సత్యనారాయణ అతని భార్య మనీలాతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సత్యనారాయణ హత్యకు గురయ్యాడు.
భర్త స్నేహితులు వచ్చి కత్తులతో బెదిరించి హత్య చేశారని తెలిపిన మనీలాపై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తన భర్త మెడకు టవల్ బిగించి బండరాయితో మోది హత్య చేసినట్లు మనీలా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : ఆ బిడ్డ వద్దు.. మాకు కూతురే కావాలి