ETV Bharat / jagte-raho

12 లక్షల కారు గెలుచుకున్నారని 6 లక్షలు నొక్కేశాడు!

కొత్తకొత్త మార్గాలతో అమాయకులను సైబర్​ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడి అందినకాడికి నొక్కేస్తున్నారు. "మీరు రూ.12లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారు. మీరు కోరితే కారు... లేదా 12 లక్షల నగదు పొందవచ్చు" అని ఉన్న స్పీడ్​ పోస్టును నమ్మి... ఏకంగా ఆరు లక్షలు మోసపోయింది హైదరాబాద్​ వారాసిగూడకు చెందిన ఓ మహిళ.

waranasi women cheated by cyber fraud and theft 6 lakhs

author img

By

Published : Oct 8, 2020, 2:22 PM IST

లాటరీ వచ్చిందని చెబితే నమ్మి ఆరు లక్షలు పొగొట్టుకున్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. వారాసిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం.శ్వేత... తన తల్లికి నాప్​టల్ షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కోల్​కతా నుంచి స్పీడ్ పోస్టు వచ్చింది. అందులో "మీరు రూ.12లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారు. మీరు కోరితే కారు... లేదా 12 లక్షల నగదు పొందవచ్చు" అని ఉంది.

అందులో ఉన్న నంబర్​ను సంప్రదించిన బాధితురాలు డబ్బులే కావాలని కోరింది. బ్యాంక్ ఖాతా నంబరు ఇస్తే డబ్బులు డిపాజిట్ చేస్తామని మోసగాడు నమ్మించాడు. బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చిన శ్వేత నుంచి వివిధ ఖర్చుల పేరిట ఆరు లక్షలు తన ఖాతాలో వేయించుకొన్నాడు. ఆ తర్వాత స్పందించడం మానేశాడు. మోసపోయినట్లు తెలుసుకుని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చికిత్స కోసం దాచుకున్న డబ్బు దోచుకున్నాడంటూ బాధితురాలు లబోదిబోమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ టోకరా.. నిరుద్యోగుల డబ్బులతో పరార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.