ETV Bharat / jagte-raho

పనిచేస్తున్న దుకాణంలోనే చోరీ... గంటల్లోనే ఛేదించిన పోలీసులు

కష్టకాలంలో ఉపాధి చూపిన యజమానికే టోకరా వేయాలనుకున్నాడు. ఏకంగా రూ.4 కోట్ల విలువైన నగలు, నగదును చోరీ చేశాడు. చేతులకు గాయాలు చేసుకుని, కాళ్లను కట్టేసుకుని నాటకం ఆడాడు. అయితే.. అతని దొంగ తెలివి.. పోలీసుల ముందు నిలవలేకపోయింది. ఏపీలోని విజయవాడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో.. పట్టపగలు జరిగిన దొంగతనం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితుడిని పట్టుకున్నారు.

huge-robbery-in-vijayawada
పనిచేస్తున్న దుకాణంలోనే చోరీ... గంటల్లోనే ఛేదించిన పోలీసులు
author img

By

Published : Jul 25, 2020, 8:31 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నగరంలోని కాటూరువారి వీధిలో రాజుసింగ్‌చరణ్‌ రెండేళ్లుగా సాయిచరణ్‌ నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపారం జరగకపోవడంతో 19 కిలోల వెండి, రూ.20 లక్షల నగదును దుకాణంలోనే ఉంచాడు. తన స్నేహితుడైన మరో నగల వ్యాపారి మనోహర్‌సింగ్‌ రాథోర్‌కు సంబంధించిన 7కిలోల బంగారం, రూ.22 లక్షల నగదునూ తన దుకాణంలోనే దాచారు.

పెద్దమొత్తంలో డబ్బు, బంగారం ఉండటంతో గురువారం రాత్రంతా దుకాణం వద్దనే ఉన్న యజమాని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లాడు. తన వద్ద పనిచేసే గురుచరణ్‌సింగ్‌ను దుకాణం వద్దకు పంపించగా... అతనితో పాటే పనిచేసే విక్రమ్​కుమార్​ లోహార్‌ రక్తపు మడుగులో దుకాణంలో పడి ఉన్నాడు. అతని కాళ్లూ, చేతులు కట్టేసి ఉన్నాయి.

వెంటనే విషయాన్ని యజమాని రాజుసింగ్‌ చరణ్‌కు తెలిపారు. సంఘటన స్థలానికి పరుగున వచ్చిన యజమాని దుకాణాన్ని పరిశీలించి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి, క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్‌ కారణంగా షాపులో పనిచేసే సిబ్బంది స్వగ్రామానికి వెళ్లడంతో రాజుసింగ్‌.. 40 రోజుల క్రితం రాజస్థాన్‌కు చెందిన విక్రమ్​కుమార్‌ లోహార్‌(23)ను పనికి కుదుర్చుకున్నారు.

పెద్దమొత్తంలో డబ్బు, బంగారం చూసేసరికి లోహార్‌ వాటిని కాజేయాలనుకున్నాడు. శుక్రవారం వెండి, బంగారం, నగదును దొంగిలించి దుకాణం కింద మరమ్మతులు జరుగుతున్న ఇంట్లో దాచిపెట్టాడు. సీసీ కెమెరాలో రికార్డయ్యే డీవీఆర్‌ (డిజిటల్‌ వీడియో రికార్డర్‌)ను తీసి కాలువలో పడేశాడు. అనంతరం దుకాణంలోకి వచ్చి టీవీ, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. చేతులను, కాళ్లను టేపుతో కట్టేసుకున్నాడు. బ్లేడ్‌తో గాయపర్చుకున్నాడు. ఎవరో వచ్చి దొంగతనం చేసినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు.

పట్టించిన సీసీ కెమెరాలు..

పోలీసులు పరిశీలిస్తుండగా రహస్య ప్రాంతంలో ఉండాల్సిన డీవీఆర్‌ లేకపోవడాన్ని గమనించారు. దుకాణంలోకి కొత్త వ్యక్తుల రాకపోకలపై సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లోహార్‌ ఒకసారి నీలంరంగు సంచితో బయటకు వెళ్లడాన్ని గుర్తించారు. దుకాణంలో లభించిన వేలిముద్రల్లో అతనివే ఎక్కువగా ఉండటంతో పోలీసులు విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి, బంగారం, వెండి, నగదు మొత్తాన్ని రికవరి చేశారు.

పనిచేస్తున్న దుకాణంలోనే చోరీ... గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ఇవీ చూడండి: కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం : సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.