స్టీవెన్ రాజ్ కుమార్ అనే వ్యక్తి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఈనెల 12న మరణించారు. 42 గంటల అవుతున్నా మృతదేహాన్ని అప్పగించడం లేదని మృతుడి బంధువులు ఆరోపించారు. బాధితునికి వచ్చే బెనిఫిట్స్‌ను లాగేసుకున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రేణుక, సోదరి వాణీ ఫిర్యాదు చేశారు.
రూ. 20 లక్షల బిల్లు వేస్తే.. రూ. 8లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించాం. ఇంకా రూ. 8లక్షల బిల్లు పెండింగ్‌లో ఉందని మృతదేహాన్ని ఇవ్వడంలేదు. ఈ విషయం బయటకు రావడం వల్ల ఆసుపత్రి యాజమాన్యం తమను పిలిచి రూ.4 లక్షలు బలవంతంగా తీసుకుని శవాన్ని అప్పగించారు. -మృతుని బంధువులు
డబ్బు తీసుకోలేదని, మృతదేహాన్ని తీసుకెళ్లడానికి తామే రాలేదని, ఆస్పత్రి తప్పేమీ లేదని తమతో బలవంతంగా చెప్పించారని వారు వాపోయారు. ఇలాంటి ఆస్పత్రిపై చర్యలు తీసుకుని ఒక మాజీ సైనికుడి భార్యకు న్యాయం చేయాలని మృతుడి తల్లి కోరారు.
సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి...
బాధితుల నుంచి అక్రమంగా ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. శవాల మీద డబ్బులు ఏరుకుంటున్న దవాఖానాలపై హైకోర్టు సుమోటాగా కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయలని కోరారు.
ఇవీచూడండి : ఇంటి మిద్దెపై విమానం.. ఔత్సాహికుడి ఘనత